స్వీయ దర్శకనిర్మాణంలో కె.విజయ్‌భాస్కర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఉషా పరిణయం’. ‘లవ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఊపశీర్షిక. ఈ సినిమాలో ఆయన తనయుడు శ్రీకమల్ హీరోగా నటిస్తున్నారు. తాన్వీ ఆకాంక్ష కథానాయిక. ఇటీవలే ఓ పాటను దుబాయ్‌లో చిత్రీకరించారు.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘టాకీ పార్ట్ పూర్తయింది. త్వరలో రెండు పాటలను కశ్మీర్లో తెరకక్కించబోతున్నాం. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. చక్కటి వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో అందరిని మెప్పిస్తుంది’ అన్నారు. సూర్య, రవి, శివతేజ, అలీ, వెన్నెల కిషోర్, శివాజీ రాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: ఆర్.ఆర్.ధృవన్, నిర్మాత, దర్శకత్వం: కె.విజయ్‌భాస్కర్.