Urmila Matondkar | బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ మతోండ్కర్ (Urmila Matondkar) తన భర్తకు విడాకులు ఇచ్చింది. తనకంటే వయసులో 10 ఏండ్లు చిన్నవాడు అయిన మోడల్ మోసిన్ అక్తార్ను ప్రేమ వివాహం చేసుకున్న ఊర్మిళ 8 ఏండ్ల తమ వైవాహిక బంధానికి స్వస్తి పలకినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విడాకుల కోసం ముంబయి కోర్టులో నాలుగు నెలల క్రితం పిటిషన్ దాఖలు చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఊర్మిళ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
బాలీవుడ్లో కర్మ్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఊర్మిళ. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అంతం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అనంతరం ఆర్జీవి దర్శకత్వంలోనే అనగనగా ఒకరోజు, రంగీలా, సత్య చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది. కమల్ హాసన్ నటించిన ఇండియన్ సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది ఈ భామ. కొన్నిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఊర్మిళ ప్రస్తుతం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనలో చేరి ఆ పార్టీలో కీలక సభ్యురాలుగా ఉంది.
Also Read..