Jani Master | లైంగిక దాడి కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master)కు షాక్ తగిలింది. ఆయనను 4 రోజుల పోలీస్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫోక్సో కోర్టు అనుమతించింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది.
జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నాలుగేండ్ల నుంచి జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించడంతోపాటు బెదిరింపులకు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్టు బాధితురాలు ఆరోపిస్తున్నందున పూర్తిస్థాయి విచారణ నిమిత్తం ఆయనను కస్టడీకి అప్పగించాలని ఆ పిటిషన్లో కోరారు.
పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. ఇవాళ జానీ మాస్టర్‌ను కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, జానీ మాస్టర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని, న్యాయవాది సమక్షంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో పోలీసులు జానీ మాస్టర్‌ను ఇవాళ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను ఈ నెల 19న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.లైంగిక వేధింపుల కేసు, పోక్సో కింద కేసులు నమోదవడంతో జానీ పరారీలో ఉండగా.. పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ పోలీసుల బృందం జానీని హైదరాబాద్‌కు తరలించి.. ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
Also Read..
Samantha | ఒకే ఫ్రేమ్‌లో సమంత, ప్రియాంక చోప్రా.. ఫొటోలు వైరల్
Jr NTR | డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడుదాం.. యువతకు ఎన్టీఆర్ పిలుపు
Mohan Babu | మోహన్ బాబు ఇంట్లో చోరీ.. రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి