Samantha | ఒకే ఫ్రేమ్‌లో సమంత, ప్రియాంక చోప్రా.. ఫొటోలు వైరల్
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha), గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చారు.
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha), గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చారు. ఇద్దరూ ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
సమంత ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్పై యాక్షన్ సిరీస్ ‘ ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel: Honey Bunny). ఇందులో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కు రీమేక్‌గా ఈ సిరీస్ రాబోతుంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా లండన్ (London)లో దీని ప్రీమియర్ ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు సమంతతోపాటు ప్రియాంక చోప్రో కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. పీసీ రెడ్ డ్రెస్‌లో మెరవగా.. సామ్ బ్లాక్ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్‌ను నవంబరు 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. కే కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్ మరియు కష్వీ మజ్ముందర్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.
Also Read..
Jr NTR | డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడుదాం.. యువతకు ఎన్టీఆర్ పిలుపు
Mohan Babu | మోహన్ బాబు ఇంట్లో చోరీ.. రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి
Kangana Ranaut | సాగుచట్టాలపై వ్యాఖ్యలు వివాదం.. క్షమాపణలు కోరిన కంగనా రనౌత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

