Telugu Youtuber Harsha Sai | ప్రముఖ తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని, శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఓ యువతి మంగళవారం హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. పేదలకు సేవ చేస్తున్నానంటూ యూట్యూబ్లో రీల్స్ చేస్తున్న హర్ష సాయి అనేక అరాచకాలకు పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాకుండా తనను ప్రేమతో మోసం చేసి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి పలుమార్లు శారీరకంగా వాడుకుని, ఇప్పు డు తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకునేందుకంటూ తన నుంచి రూ.2 కోట్ల నగదు తీసుకున్నాడని, ఇందుకు ఆయన తండ్రి రాధాకృష్ణ కూడా కారణమని పేర్కొన్నది. అయితే దీనిపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు విచారణ చేపట్టి తదుపరి వివరాలు తెలుపుతామని చెప్పారు.
ఇదిలావుంటే తాజాగా ఈ ఘటనపై యూట్యూబర్ హర్షసాయి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నాపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్దం. డబ్బుల కోసమే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా గురించి మీ అందరికి తెలుసు. త్వరలోనే నిజానిజాలు బయటకోస్తాయి. ఈ వివాదంపై విజయవాడకు చెందిన మా లాయర్ తానికొండ చిరంజీవి త్వరలో మీ ముందుకు వస్తారు అంటూ రాసుకోచ్చాడు.
Harsha Sai