UI The Movie | కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra)కాంపౌండ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘యూఐ’ (UI The Movie). ఉపేంద్ర కథనందిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నాడు. రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగాకన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు ఉపేంద్ర.
ఉపేంద్ర తలైవా టైటిల్ రోల్లో నటిస్తున్న కూలీ చిత్రంలో కీ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. ఉపేంద్ర జైపూర్ తాజా షెడ్యూల్లో అమీర్‌ఖాన్, తలైవా అండ్ టీంతో షూటింగ్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అమీర్‌ఖాన్ యూఐ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. నేను అతడికి పెద్ద అభిమానిని. ఆయన సినిమా యూఐ డిసెంబర్ 20న విడుదలవుతుంది. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. నా స్నేహితుడు ఉపేంద్రను మీకు పరిచయం చేస్తున్నా. అద్భుతమైన ట్రైలర్ రెడీ చేశావ్.. నమ్మశక్యంగా అనిపించనివిధంగా ఉందన్నాడు అమీర్ ఖాన్.
హిందీ ప్రేక్షకులు కూడా నిన్ను చాలా ఇష్టపడతారు. ట్రైలర్ చూసి షాకయ్యా. సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. అంటూ ఉపేంద్రను అమీర్ ఖాన్ విష్ చేయగా.. ధన్యవాదాలు తెలియజేశాడు కన్నడ స్టార్ యాక్టర్. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మనోహరన్-శ్రీకాంత్ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తు్న్న ఈ మూవీకి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్టైనర్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.
అమీర్‌ఖాన్ యూఐ ప్రమోషన్స్..
Dear Aamir sir, it was a dream come true moment to meet and seek your blessings for UI The Warner Movie 🙏
thanks for your love and support ❤️#UiTheMovieOnDEC20th#Aamirkhan#UppiDirects #Upendra @nimmaupendra #GManoharan @Laharifilm @enterrtainers @kp_sreekanth… pic.twitter.com/EcPcIVgS8z— Upendra (@nimmaupendra) December 11, 2024
Akhanda 2 | అఖండ 2 వచ్చేది అప్పుడే.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న బాలకృష్ణ టీం రిలీజ్ డేట్ ప్రోమో
Manchu Manoj | నా తల్లి ఆస్పత్రిలో లేదు.. మాట్లాడుకోవడానికి సిద్ధం : మంచు మనోజ్