UI The Movie | తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కన్నడ స్టార్ యాక్టర్ల జాబితాలో టాప్లో ఉంటాడు ఉపేంద్ర (Upendra). ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా ప్రాజెక్ట్ ‘యూఐ’ (UITheMovie). పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో ఉండబోతున్న ఈ చిత్రాన్ని మనోహరన్-శ్రీకాంత్ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సౌండ్ ఆఫ్ యూఐ (Sound Of Ui)ని లాంచ్ చేశారు మేకర్స్. సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ సాగే థీమ్ మూవీపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా రేపు ఉదయం 10:08 గంటలకు యూఐ స్పెషల్ పోస్టర్, సాయంత్రం 5:04 గంటలకు మేకింగ్ వీడియోను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
రీష్మా నానయ్య హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఉపేంద్ర టీం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే విడుదల చేసిన యూఐ అనౌన్స్మెంట్ వీడియో నెట్టింట వ్యూస్ పంట పండిస్తోంది. ఈ మూవీని లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్టైనర్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన బీటీఎస్ వీడియో కూడా సినిమాపై సూపర్ క్యూరియాసిటీ పెంచుతోంది.
A MASSive treat awaits from our @nimmaupendra
Special Birthday POSTER at 10:08 AM & a Making Video at 5:04 PM! #UiTheMovie pic.twitter.com/2G2BZrDsfl
— BA Raju’s Team (@baraju_SuperHit) September 17, 2024
Jani Master | పెద్ద హీరో ఆ అమ్మాయికి సినిమాలో అవకాశమిస్తామన్నారు.. జానీ మాస్టర్ వివాదంపై ఝాన్సీ