TVK Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఓటమి పాలయ్యారని తెలిసిందే. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఎంకే స్టాలిన్ పరాజయాన్ని చవిచూశారు. కొళత్తూరు నియోజకవర్గం నుంచి ఎంకే స్టాలిన్ పోటీ చేయగా.. ఆయనపై టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయ దుందుభి మోగించాడు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో విజయ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ తీరిక లేకుండా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఇదే పరిస్థితిని క్యాష్ చేసుకున్న టీవీకే అభ్యర్థి వీకే బాబు చతురతను ఉపయోగించి విజయ్ డూప్‌తో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. కంటిన్యూగా గెలుస్తూ బలమైన అభ్యర్థిగా ఉన్న డీఎంకే చీఫ్ ఎం కే స్టాలిన్‌ను ఓడించడంలో వీకే బాబు ప్రచారాస్త్రం బాగానే వర్కవుట్ అయిందనే చెప్పాలి. మొత్తానికి విజయ్ లేకున్నా ఉన్నట్టుగా ప్రజల్లోకి వెళ్లి సీఎం అభ్యర్థిని ఓడించి సినీ, రాజకీయ వర్గాల్లో వీకే బాబు సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజా సమాచారం ప్రకారం టీవీకే అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. 107 స్థానాల్లో టీవీకే, 53 స్థానాల్లో డీఎంకే, 74 స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. 1996 తర్వాత ఎంకే స్టాలిన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.