Tuck jagadish in Amazon prime | నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమా.. సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలవుతుంది. నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత శివ, నాని కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో టక్ జగదీష్ పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై విడుదల కానుండటంతో అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా షాక్ లోకి వెళ్లిపోయారు. దానికి తోడు గతేడాది సెప్టెంబర్‌లో వి సినిమాతో డిజిటల్ మీడియాలోనే ప్రేక్షకులను పలకరించాడు నాని.
ఇప్పుడు వరుసగా రెండోసారి తన సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తుండటంతో అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఇంత పెద్ద సినిమాను ఎందుకు ఓటీటీలో విడుదల చేస్తున్నారు అనే విషయంపై నిర్మాతలు పూర్తి క్లారిటీ ఇచ్చారు. తమకు థియేటర్లలో విడుదల చేస్తే ఎక్కువగా లాభాలు ఉంటాయని.. అది తెలిసి కూడా డిజిటల్ వైపు వెళ్లామంటే కారణం ఉన్నట్టే కదా అంటున్నాడు నిర్మాత సాహూ. బయట నిజంగా పరిస్థితులు బాగుంటే ఇంత పెద్ద సినిమా థియేటర్లలో విడుదల చేయకుండా ఎందుకు ఉంటాం అంటున్నాడు ఈయన.
కరోనావైరస్ కారణంగా పరిస్థితులేమీ బాగోలేవు. ఇప్పుడప్పుడే మునపటి పరిస్థితులు వచ్చేలా కనిపించడం లేదు. ఓవర్సీస్ అయితే మరీ దారుణంగా ఉంది.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్స్ పూర్తిస్థాయిలో ఓపెన్ కాలేదు.. ఇలాంటి సమయంలో సినిమా విడుదల చేస్తే రెవెన్యూ ఎలా వస్తుంది అంటూ ప్రశ్నిస్తాడు నిర్మాత సాహూ. ఆ మధ్య పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదలైన రెండు వారాల తర్వాత ఏమైందో అందరికీ తెలుసు.. ఒక్కసారిగా కేసులు పెరగడంతో సినిమాను మూడు వారాలకే ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది అంటున్నాడు. అలాంటి పరిస్థితులే ఇప్పుడు వస్తే ఏం చేస్తాం.. అందుకే తమ సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి తీసుకొస్తున్నాం అంటున్నాడు సాహూ గరపాటి. ఇంచుమించు ఇదే సమాధానం నాని కూడా చెప్పాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
MAA: ఆ పదవిని నేను నిర్వర్తించలేను, న్యాయం చేయలేను: బండ్ల గణేష్
lahari shari | ఇంతకీ లహరి షారి ఎవరు.. బిగ్ బాస్‌కు ఎలా వచ్చింది..?
ఆ షాట్ తర్వాత బాగా ఏడ్చేశా.. ఎమోషన్ అయిన రాశీ ఖన్నా
MAA Elections | మంచు విష్ణు Vs ప్రకాశ్ రాజ్ .. మా అధ్యక్ష ఎన్నికలను అలా సెట్ చేశారన్నమాట..