సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత నెటిజన్లు ఏదో ఒక విషయాన్ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఆ ట్రోల్స్ (Trolls)ను పట్టించుకోకుండా తమ పని తాము చేసుకునే వారు కొందరైతే..ట్రోల్స్ కు తమదైన స్టైల్ లో స్పందించేవారు మరికొందరు. నాని (Nani ) హీరోగా నటించిన చిత్రం టక్ జగదీష్ ( Tuck Jagadish). ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చిత్రం విషయంలో ట్రోల్స్ తెరపై వచ్చాయి.
సినిమా విడుదలైన తర్వాత కొందరు నెటిజన్లు నానిపై చాలా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే నానిని అంతలా ఎందుకు టార్గెట్ చేశారనేది మాత్రం స్పష్టత లేదు. ఇక ఈ ట్రోల్స్ పై డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana )స్పందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. తాను మంచి, చెడు, పాజిటివ్, నెగెటివ్ తోపాటు అన్ని స్పందనలను అంగీకరిస్తున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతేకాదు ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్దంగా ఉన్నానని శివ నిర్వాణ చెప్పడం ఆసక్తికరం.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన టక్ జగదీష్ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, రావురమేశ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ చిత్రాన్ని మిక్స్ డ్ టాక్ వస్తోంది.
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Sampath Nandi| సీటీమార్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..?
Shah Rukh Khan | స్టార్ హీరో ఓటీటీ ఎంట్రీ..!