టాలీవుడ్ (Tollywood) మోస్ట్ క్రేజీ కాంబినేషన్ మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). ఈ ఇద్దరూ త్వరలోనే ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారని తెలిసిందే. ఇప్పటివరకున్న అప్డేట్ ప్రకారం సెప్టెంబర్ రెండోవారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
తాజాగా కొత్త అప్డేట్ ఇపుడు అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఈ సినిమాకు ఎన్టీఆర్‌తో తీసిన అరవింద సమేత ఫార్ములాను ఫాలో అవుతున్నాడట త్రివిక్రమ్. ఫస్ట్ డే ఫస్ట్ షెడ్యూల్లో కీలక ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. కేజీఎఫ్ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్-అరివు ఈ ఫైట్స్ ను కంపోజ్ చేయనున్నట్టు టాక్.
అరవింద సమేతకు కూడా మొదటి రోజు తొలి షెడ్యూల్‌ను ఫైట్ సీన్ల చిత్రీకరణతోనే మొదలుపెట్టాడు. ఇదే మహేశ్ బాబు సినిమాకు కూడా చేస్తుందడటంతో..సెంటిమెంట్ ఏమైనా ఫాలో అవుతున్నాడా..? అని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం రామోజీ ఫిలింసిటీలో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ సారథ్యంలో భారీ సెట్టు వేయించారు మేకర్స్.
ఇక యాక్షన్ పోర్షన్ పూర్తవగానే త్రివిక్రమ్ కామెడీ ట్రాక్‌పై దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : Samantha | లాంగ్ బ్రేక్..మళ్లీ నెట్టింట ప్రత్యక్షం కానున్న సామ్..!
Read Also : Mahesh Babu Look | మహేశ్‌బాబు కొత్త లుక్..స్పెషల్ ఇదే..!
Read Also : Balakrishna Selfie | బ్యూటీఫుల్ లొకేషన్..బాలకృష్ణ, శృతిహాసన్, డైరెక్టర్ సెల్ఫీ