AA22 | టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాంబోల్లో ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram srinivas)-అల్లు అర్జున్ (Allu Arjun). ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ ఆఫ్ సత్యమూర్తి మంచి హిట్స్‌గా నిలిచాయి. ఇక త్రివిక్రమ్-బన్నీ మరోసారి AA22 ప్రాజెక్టుతో రాబోతున్నారని తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది.
శివపార్వతుల పుత్రుడు లార్డ్ కార్తికేయ (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి)ప్రయాణం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా సోషియో మైథలాజికల్ ఫాంటసీ నేపథ్యంలో ఉండబోతుందని ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ మూవీ తండ్రీకొడుకుల (శివుడు- కార్తికేయ) పున: కలయికను చూపించబోతుందట. ఇంకేంటి మరి ఇదే నిజమైతే మాటల మాంత్రికుడుగా పేరున్న త్రివిక్రమ్ కాంపౌండ్ నుంచి మరో బ్లాక్ బస్టర్ ఖాయమైనట్టేనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
గాడ్ ఆఫ్ వార్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారని ఇన్సైడ్ టాక్. ఏఏ22 అనౌన్స్మెంట్ వీడియో కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఇటీవలే పుష్ప 2 ది రూల్ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు బన్నీ. గతేడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు త్రివిక్రమ్. ఈ సారి బన్నీతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీయబోయే సినిమా ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Pushpa 2 on OTT | ఓటీటీలోకి ‘పుష్ప 2 ది రూల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Vaishnavi Chaitanya | జిమ్ సెషన్లో బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. వర్కవుట్స్‌తో బిజీబిజీ