Trivikram-Allu Arjun Fourth Movie | ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకు ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. వాళ్ల కాంబోలలో సినిమా వస్తుందంటే సినీ లవర్సే కాదు సినీ సెలబ్రిటీలు సైతం అమితాసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో ఒకటి. పదేళ్ల క్రితం జులాయి సినిమాతో మొదలైన వీళ్ల జర్నీ అల వైకుంఠపురంతో ఆల్ టైమ్ రికార్డులు కొట్టేంత వరకు వచ్చింది. వీళ్ల కలయికలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం ఇలా మూడు సినిమాలు ఒకదానికి మించి మరొకటి బంపర్ హిట్లయ్యాయి. మళ్లీ ఈ కాంబో కోసం బన్నీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా వీళ్లిద్దరూ కలిసి మరోసారి చేతులు కలుపనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు.
హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ల తర్వాత త్రివిక్రమ్-బన్నీ కలిసి నాలుగో సినిమా చేయబోతున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. గీతా ఆర్ట్స్, హాసిన్ అండ్ హారికా క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫుల్ డీటేయిల్స్ త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం త్రివిక్రమ్ గుంటూరు కారంతో, బన్నీ పుష్ప సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. వీళ్లిద్దరూ తమ తమ ప్రాజెక్ట్‌లను ఫినీష్ చేసుకుని ఈ ప్రాజక్ట్‌ను మొదలుపెట్టనున్నారు.
పుష్పతో బన్నీకు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో పుష్ప సీక్వెల్‌ను మరింత గ్రాండ్ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉంది. సంక్రాంతికి ఎట్టి పరిస్థుతుల్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
We are elated to reunite the much celebrated duo. It's the Icon Star @alluarjun garu & our Darling Director #Trivikram garu coming together for the 4th time 🤩🌟
More Details Soon 🖤 #AlluAravind #SRadhaKrishna @haarikahassine @geethaarts
— Naga Vamsi (@vamsi84) July 3, 2023