Samantha | నటి సమంత,దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ శుభవార్తను సమంత సోషల్ మీడియాలో ఒక స్వీట్ నోట్‌తో స్వయంగా ధృవీకరించారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కోయంబత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్‌లో లింగ భైరవ సంప్రదాయంలో ఈ వివాహం జరగడం విశేషంగా నిలిచింది.పెళ్లి తర్వాత సమంత–రాజ్ జంట తొలిసారిగా కలిసి బహిరంగంగా కనిపించారు.
శనివారం మధ్యాహ్నం ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరుతున్న సమయంలో ఈ నూతన వధూవరులు కెమెరాలకు చిక్కారు. ఇద్దరూ సాధారణ దుస్తుల్లో సింపుల్‌గా కనిపించగా, ఫోటోగ్రాఫర్లు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేయగా వారు చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలిపారు. సమంత అక్కినేని గతంలో నాగ చైతన్యను వివాహం చేసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగ చైతన్య నటి శోభిత ధూళిపాలను పెళ్లాడారు. మరోవైపు రాజ్ నిడిమోరు 2015లో శ్యామలి దేతో వివాహం చేసుకోగా, 2022లో వీరు విడిపోయినట్లు ప్రచారం జరిగింది. సమంత–రాజ్ మధ్య సంబంధం గురించి గత ఏడాది ప్రారంభం నుంచే పుకార్లు వినిపించాయి. అప్పటి నుంచి ఈ జంట బహిరంగ కార్యక్రమాల్లో కలిసి కనిపించడం, కలిసి నివసిస్తున్నారన్న వార్తలు రావడం చర్చకు దారితీశాయి. అయినప్పటికీ ఇద్దరూ తమ బంధంపై ఎప్పుడూ అధికారిక ప్రకటన చేయలేదు.
సమంత తన సోషల్ మీడియా పోస్టుల్లో అప్పుడప్పుడు రాజ్ పేరును ప్రస్తావిస్తూ అభిమానులను టీజ్ చేసినా, వారి సంబంధాన్ని స్పష్టంగా ధృవీకరించలేదు. ఇక వీరి పరిచయం ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ సెట్స్‌లో మొదలైందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ సిరీస్ పూర్తైన తర్వాత కూడా కలిసి పలు ప్రాజెక్ట్స్‌లో పని చేయడం వల్ల స్నేహం కాస్తా ప్రేమగా మారిందని సమాచారం. ‘సిటాడెల్: హనీ బన్నీ’ కోసం దాదాపు ఏడాది పాటు కలిసి పనిచేయగా, ప్రస్తుతం రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న ‘రక్త్ బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్‌లో కూడా సమంత నటిస్తోంది. ఈ సిరీస్‌లో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బి, జైదీప్ అహ్లావత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2026లో విడుదలయ్యే అవకాశమున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా, చాలా కాలంగా కొనసాగిన పుకార్లకు సమంత–రాజ్ పెళ్లి ముగింపునిచ్చింది.
#Samantha was seen at the airport with husband #RajNidimoru for the first time after their wedding. 😍
#FilmfareLens pic.twitter.com/ohc48wCUgj
— Filmfare (@filmfare) December 13, 2025