Bigg Boss Top 5 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో 14వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉత్కంఠభరితంగా సాగింది. హోస్ట్ నాగార్జున ముందుగానే ప్రకటించినట్లుగానే ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లు హౌజ్‌ను వీడారు. శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా, రెండో ఎలిమినేషన్‌పై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో తాజాగా క్లారిటీ వచ్చింది. 14వ వారం రెండో ఎలిమినేషన్లో భరణి బయటకు వెళ్లారు. భరణి ఎలిమినేషన్ ప్రాసెస్ రాత్రికే పూర్తయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ను ఆదివారం సాయంత్రం ప్రసారం చేయనున్నారు. సుమన్ శెట్టి తర్వాత సంజనా ఎలిమినేట్ అవుతుందని కొందరు అంచనా వేసినా, చివరకు భరణినే పంపించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. భరణి ఇప్పటికే ఆరో వారంలో ఎలిమినేట్ అయ్యి, ఆపై నిర్వాహకుల నిర్ణయంతో రీ-ఎంట్రీ ఇచ్చారు.
భరణి రీ-ఎంట్రీపై గతంలోనే వివాదాలు చెలరేగాయి. నాగబాబు ఒత్తిడి, పవన్ కళ్యాణ్ రికమండేషన్‌తోనే భరణిని మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చారని దివ్వెల మాధురి ఆరోపించిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ వీక్‌లో నాగబాబు హాజరు కావడం, అలాగే నాగార్జున–నిహారిక మధ్య సంభాషణ లీక్ కావడం వంటి ఘటనలు ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చాయి. భరణిని టాప్ 5లో ఉంచాలని సూచనలు వచ్చాయని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే టాప్ 5లో ఉంచితే విమర్శలు వెల్లువెత్తుతాయన్న అంచనాతోనే నిర్వాహకులు 14వ వారంలోనే భరణిని ఎలిమినేట్ చేసినట్లు సమాచారం. రీ-ఎంట్రీ తర్వాత కూడా భరణి తన ఆటపై పట్టు సాధించకపోవడం, యాక్టివిటీ తక్కువగా ఉండడం, ఒరిజినాలిటీపై విమర్శలు రావడం ఆయన ఎలిమినేషన్‌కు కారణాలుగా చెబుతున్నారు.
సుమన్ శెట్టి, భరణి ఎలిమినేట్ కావడంతో బిగ్‌బాస్ తెలుగు 9 టాప్ 5 కంటెస్టెంట్లు కన్ఫర్మ్ అయ్యారు. ఇప్పటికే కళ్యాణ్ పడాల ఫైనల్‌కు చేరుకోగా, ఇమ్మాన్యుయెల్, తనూజ, సంజనా, డీమాన్ పవన్ హౌజ్‌లో కొనసాగుతున్నారు. సోమవారం నుంచి వీరి జర్నీలను ప్రత్యేక ఎపిసోడ్లలో చూపించనున్నారు. ఇప్పుడు ఈ ఐదుగురి మధ్యే బిగ్‌బాస్ టైటిల్ పోరు జరగనుంది. సోషల్ మీడియాలో ఇమ్మాన్యుయెల్ విన్నర్‌గా ఫిక్స్ అయ్యారన్న ప్రచారం సాగుతుండగా, కామన్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన కళ్యాణ్ పడాల అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. మరి చివరకు బిగ్‌బాస్ ట్రోఫీ ఎవరి చేతుల్లోకి వెళ్తుందో చూడాలి.