Trivikram | పవన్ కళ్యాణ్‌కు త్రివిక్రమ్ అంటే అంత ఇష్టమా.. ఇదే నిదర్శనం..!
Trivikram | పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య ఎంత మంచి స్నేహం ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్లిద్దరూ హీరో, దర్శకుడు అనేకంటే ప్రాణ స్నేహితులు అంటే కరెక్ట్. జయాపజాయాలతో సంబంధం లేకుండా కనెక్ట్ అయిపోయారు. పవన్ చేసే ప్రతి పనిలో కూడా త్రివిక్రమ్ భాగస్వామిగా ఉంటాడు.
Trivikram | పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య ఎంత మంచి స్నేహం ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్లిద్దరూ హీరో, దర్శకుడు అనేకంటే ప్రాణ స్నేహితులు అంటే కరెక్ట్. జయాపజాయాలతో సంబంధం లేకుండా కనెక్ట్ అయిపోయారు. పవన్ చేసే ప్రతి పనిలో కూడా త్రివిక్రమ్ భాగస్వామిగా ఉంటాడు. మరీ ముఖ్యంగా పాలిటిక్స్ తో క్షణం తీరిక లేకుండా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ దగ్గరుండి చూసుకుంటున్నాడు త్రివిక్రమ్. ఆయన చేసే ప్రతి సినిమాకు బ్యాక్ బోన్‌లా ఉంటున్నాడు గురూజీ. అంతే కాదు తాను ఒక స్టార్ డైరెక్టర్ అయ్యుండి కూడా స్నేహితుడి కోసం ఒక మెట్టు దిగి డైలాగ్ రైటర్‌గా మారాడు.
గతేడాది భీమ్లా నాయక్.. ఇప్పుడు బ్రో సినిమా కోసం మాటలు రాశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ఇద్దరి మధ్య అంత మంచి సాన్నిహిత్యం ఉంది. అంతేకాదు పవన్ ఎలాంటి సినిమాలు చేయాలి.. ఇప్పుడున్న తక్కువ సమయంలో ఏ సినిమా చేస్తే మంచిది.. ఏది కాదు అనే నిర్ణయం కూడా పూర్తిగా త్రివిక్రమ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన కెరీర్ విషయంలో స్నేహితుడికి అంత ఫ్రీడమ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో..! ఇదిలా ఉంటే తాజాగా త్రివిక్రమ్ కోసం పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఒకవైపు పవన్ సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు మహేశ్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. దీనికి గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. సంక్రాంతి సందర్భంగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చాలా రోజుల ముందే దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని దర్శకుడు హరీశ్ శంకర్ చెప్పాడు. నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి.. జనవరిలో సినిమా విడుదల చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ తన స్నేహితుడి సినిమా కూడా పండక్కి ఉండడంతో తన సినిమాను సమ్మర్ కు వాయిదా వేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తన నిర్మాతలను కూడా ఒప్పించే బాధ్యత పవన్ తీసుకున్నాడు. సంక్రాంతి సీజన్ మిస్ చేసుకుంటే చేతులారా 200 కోట్ల బిజినెస్ వదులుకున్నట్టే. తన స్నేహితుడి కోసం ఇది పెద్ద లెక్క కాదు అనుకుంటున్నాడు పవన్. మరోవైపు సంక్రాంతికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే కూడా విడుదల కానుంది. ఇంత పోటీ మధ్య పవన్ సినిమా వస్తే థియేటర్స్ ఇష్యూ కూడా మొదలవుతుంది. అందుకే అన్నీ ఆలోచించి తన సినిమాను తర్వాత తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.
Read More :
UV Creations | యువీ క్రియేషన్స్ విడిపోయిందా.. తెర వెనుక అసలు నిజాలు ఇవే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

