Trisha Krishnan | సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సోమవారం ఉదయం తిరుమలలో శ్రీవారి సేవలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. సాధారణంగా సెలబ్రిటీలు తిరుమలకు వెళ్లడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి త్రిష పర్యటన ప్రత్యేకంగా మారడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆమె పుట్టినరోజు కావడం, మరొకటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇదే రోజున వెలువడటం. తిరుమలలో త్రిష దర్శనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినట్లు కొందరు భావిస్తుండగా, మరికొందరు దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉందని అంటున్నారు.
ఇటీవల తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్‌లో ఈ పార్టీకి అనుకూల ఫలితాలు రావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ విజయాన్ని కోరుకుంటూ త్రిష తిరుమలకు వచ్చిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇక గత కొంతకాలంగా విజయ్, త్రిష మధ్య వ్యక్తిగత సంబంధంపై కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య త్రిష ఈ సమయంలో తిరుమల రావడం మరింత చర్చనీయాంశంగా మారింది.
అయితే మరోవైపు, ఇది పూర్తిగా వ్యక్తిగత ఆధ్యాత్మిక పర్యటన మాత్రమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం కోసం త్రిష తిరుమలకు వచ్చిందని, ఇందులో ఇతర అర్థాలు వెతకాల్సిన అవసరం లేదని అంటున్నారు. మొత్తానికి తమిళనాడు ఎన్నికల ఫలితాల ఉత్కంఠ మధ్య త్రిష తిరుమల పర్యటన ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఇక విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఈ ఎన్నికల్లో ఎలా ప్రదర్శన చేస్తుందో మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది.
Actress #Trisha visited #Tirumala today to seek the blessings of Lord #VenkateshwaraSwami .#TrishaKrishnan pic.twitter.com/bGcmELhAJq
— Milagro Movies (@MilagroMovies) May 4, 2026