Brinda | తెలుగు, తమిళ భాషల్లో స్టార్ యాక్టర్లతో కలిసి నటిస్తూ సౌతిండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది త్రిష (Trisha). ఈ భామ తాజా వెబ్ సిరీస్ బృంద (Brinda). త్రిష కెరీర్లో తొలి ఓటీటీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు సూర్య మనోజ్ వంగల రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఈ తెలుగు వెబ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీలివ్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.
క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లా భాషల్లో కూడా అందుబాటులో ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే డెబ్యూ ప్రాజెక్టులో త్రిష ఎంట్రీలోనే స్టన్నింగ్ పర్ ఫార్మెన్స్‌తో తన పాత్రలో జీవించేసిందని ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది. యాడింగ్ అడ్వర్టైజింగ్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై కొల్ల అశిష్ నిర్మించిన బృందకు శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ కంపోజర్.
ఈ వెబ్ ప్రాజెక్టులో త్రిష సస్పెండ్ అయిన పోలీసాఫీసర్‌గా నటించగా.. ఇంద్రజిత్ సుకుమారన్, జయ ప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్సామి, రాకేందు మౌళి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. నరాలు చిట్లిపోయే.. సీట్లకు అతుక్కుపోయే థ్రిల్లర్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.
Nerve Cracking & Seat Edge Thriller #Brinda is now streaming on @SonyLIV. Not To Be Missed .#BrindaOnSonyLIV @trishtrashers @Indrajith_S @suryavangala530 @andstoriesllp
pic.twitter.com/OzYyVyiJS0— BA Raju’s Team (@baraju_SuperHit) August 13, 2024
Ravi Teja | సుమ, భాగ్య వీళ్లే ఫొటో తీయండి.. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో రవితేజ
Committee Kurrollu | యదువంశీ కథకు జీవం పోశాడు.. కమిటీ కుర్రోళ్లు మూవీపై రాంచరణ్