తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కు రేపు మరిచిపోలేని రోజు. ఈ విషయాన్ని ఇవాళ ఉదయం ట్విటర్ ద్వారా తెలియజేశారు రజినీకాంత్. అక్టోబర్ 25 (సోమవారం)న రజినీకాంత్‌కు రెండు ప్రత్యేకమైన విషయాలున్నట్టు చెప్పారు. అందులో ఒకటి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు (Dada Saheb Phalke award) అందుకోవడం. భారత ప్రభుత్వం ( Indian government) రజినీకాంత్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించనుంది.. ఇక సోమవారానికున్న మరో ప్రత్యేకత..తన కూతురు సౌందర్య ప్రజలకు ఉపయోగపడే వాయిస్ బేస్డ్ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం HOOTE ( HOOTE APP)యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం అని ట్వీట్ లో పేర్కొన్నారు.
ప్రజలు అన్ని భాషల్లో తమ గొంతుకను, వారి ఆలోచనలు, విషెస్, ఐడియాలను రాతపూర్వకంగా ఈ ప్లాట్‌ఫాం ద్వారా పంచుకునే వీలుంటుంది. సౌందర్య ప్రజల అభిప్రాయాలను ప్రపంచానికి తెలియజేస్తుందని ట్వీట్ చేశారు రజినీకాంత్. ఇలాంటి వినూత్నమైన HOOTE యాప్‌ను లాంఛ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా ఉపయోగకరమైనది. ఇలా నేను వాయిస్ అందించడం మొదటిసారి అంటూ ట్వీట్ చేశారు.
హూట్ యాప్ పై ఓ లుక్కేయండి మరి..
💙🇮🇳🌎😇🙏🏻 https://t.co/AWHSAG7Vfk
— soundarya rajnikanth (@soundaryaarajni) October 6, 2021
సినిమాల విషయానికొస్తే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివతో కలిసి అన్నాత్తె చిత్రాన్ని చేస్తున్నారు రజినీకాంత్. తెలుగులో పెద్దన్నగా రాబోతుందీ చిత్రం. దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో దుబాయ్‌కు రవితేజ..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత