
టాలీవుడ్లో ఇప్పుడు రాజమౌళిపై చాలామంది నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు. బయటికి చెప్పడం లేదు కానీ రాజమౌళిపై పీకల్లోతు కోపంతో కనిపిస్తున్నారు. ఎందుకంత కోపం అనుకోవచ్చు కానీ కాస్త ఆలోచిస్తే దీనికి సమాధానం ఇట్టే తెలిసిపోతుంది. దానికి కారణం ఆయన తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్.. దాని రిలీజ్ డేట్‌తో సమస్యలు. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో తెలియక చాలా మంది నిర్మాతలు కాచుకుని కూర్చున్నారు. తీరా తమ సినిమా విడుదల తేదీ ప్రకటించిన తర్వాత రాజమౌళి ఎక్కడ దండయాత్రకు వస్తాడో అని కంగారు పడుతున్నారు.
రాజమౌళికి కూడా ట్రిపుల్ ఆర్ చుక్కలు చూపిస్తుంది. తన 20 ఏళ్ల కెరీర్లో ఇప్పటి వరకు ఎన్నో సంచలన విజయాలు అందుకున్నాడు జక్కన్న. ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడు. అలాంటి దిగ్గజ దర్శకుడికి ట్రిపుల్ ఆర్ చుక్కలు చూపిస్తోంది. మూడేళ్లుగా ఇంకా చెప్పాలంటే నాలుగేళ్లుగా ఈ సినిమాను చెక్కుతూనే ఉన్నాడు రాజమౌళి. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలను ఒకే సినిమాలో చూపిస్తున్నాడు రాజమౌళి. అలాంటి సాహసం చేస్తున్నప్పుడు సమయం కూడా ఎక్కువగానే పడుతుంది. అయితే అనుకున్న దాని కంటే రెండింతలు ఎక్కువ సమయం పడుతుండటంతో రాజమౌళి కంగారు పడుతున్నాడు. 2019లో ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు 2020 జూలై 30న విడుదల చేస్తానని మాటిచ్చాడు రాజమౌళి. అయితే అనుకోని కారణాలతో షూటింగ్ ఆలస్యం అయింది.
దాంతో 2021 జనవరి 8కి వాయిదా వేశాడు. ఇంతలో కరోనా వచ్చింది. షూటింగ్ చాలా వరకు ఆగిపోయింది. దీంతో రిలీజ్ డేట్ అక్టోబర్ 13కు మార్చాడు రాజమౌళి. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పుడు ఈ డేట్‌కు కూడా సినిమా రావడం లేదు. బాహుబలి లాంటి భారీ సినిమాను తెరకెక్కించినప్పుడు కూడా రాజమౌళి ఇంత కంగారు పడి ఉండకపోవచ్చు. కానీ ట్రిపుల్ ఆర్ మాత్రం చాలా కంగారు పెడుతుంది. ఎందుకంటే రోజులు పెరిగిపోతున్న కొద్దీ బడ్జెట్ కూడా పెరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు దాటిపోయిందని తెలుస్తోంది. దానికి తగ్గట్లుగానే బిజినెస్ కూడా జరగాలి.. జరిగిన బిజినెస్‌కు తగ్గట్టుగా కలెక్షన్స్ కూడా రావాలి. ఇవన్నీ జరగాలంటే సినిమా అనుకున్న సమయానికి విడుదల కావాలి. మరోవైపు ఈయన సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో తెలియకపోవడంతో మిగిలిన నిర్మాతలు కూడా జక్కన్నపై అసంతృప్తిగానే కనిపిస్తున్నారు. సంక్రాంతికి వస్తే చాలా సినిమాలు ఎఫెక్ట్ అవుతాయి.. సమ్మర్‌కు కూడా 10 సినిమాల వరకు క్యూలో ఉన్నాయి. దీంతో రాజమౌళికి కూడా కంగారు తప్పట్లేదు. చూడాలిక.. చివరికి ఏం జరుగుతుందో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
దృశ్యం పాపను గుర్తుపట్టారా ? ఇంతలా మారిపోయిందేంటి?
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
మరో రీమేక్‌లో మెగాస్టార్ .. సొంత కథలపై చిరంజీవికి నమ్మకం పోయిందా ?
నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్
Bandla: ఎన్టీఆర్‌తో గొడవపై స్పందించిన బండ్ల గణేష్..!
హిమాలయాల్లో జ్యోతిక.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు