కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) మృతిపై సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మృతిపట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు, మంచు విష్ణు, లక్ష్మీ, మనోజ్, ఎన్టీఆర్, నితిన్, రాంగోపాల్ వర్మతోపాటు పలువురు ప్రముఖులు సోషల్‌మీడియా ద్వారా సంతాపాన్ని ప్రకటించారు.
Chiranjeevi | పునీత్ రాజ్ కుమార్ మరణం అత్యంత బాధాకరమని చిరంజీవి (Chiranjeevi) అన్నారు. పునీత్ మరణ వార్తతో తీవ్ర వేదనతో హృదయం ముక్కలైంది. పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కన్నడ చిత్ర పరిశ్రమే (Sandalwood) కాకుండా, యావత్ భారత చిత్ర పరిశ్రమకు పునీత్ మరణం పెద్ద లోటు. పునీత్ కుటుంబానికి, బంధుమిత్రులకు, అభిమానులకు ధైర్యం చేకూరాలని ఆశిస్తున్నట్టు ట్విటర్ లో ఓ సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు.
Mohanbabu | రాజ్‌కుమార్ కుమారుడు పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం విని ఆశ్చర్యపోయినట్టు నటుడు మోహన్ బాబు (Mohanbabu) అన్నారు పునీత్ మృతి కన్నడ పరిశ్రమకే కాదు యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు. ఆ భగవంతుడు కన్నడ ప్రజలు, సినీ పరిశ్రమకు, మా లాంటి ఆత్మీయులకు తీరని లోటు పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Ram Gopal Varma | మరణానికి పక్షపాతం లేదు..అది ఎవరినైనా తన ఇష్టానుసారం చంపుతుంది..అంటూ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణంపై ట్వీట్ చేశాడు వర్మ (Ram Gopal Varma). షాకింగ్ ట్రాజెడీ.. ‘ఆకస్మిక మరణం ఏంటంటే, మనలో ఎవరైనా ఎప్పుడైనా చనిపోవచ్చు అనేది భయంకరమైన నిజం. మనం జీవించి ఉండగానే..చేతులు ముడుచుకుని ఉండకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్‌లో జీవించడం ఉత్తమ’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు వర్మ.
Apart from the shocking tragedy that @PuneethRajkumar ‘s sudden death is, it is also a scary and terrifying eye opening truth that any of us can die anytime 😳😳😳 So it is best to live life on a fast forward mode , while we are still alive🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2021
Mahesh Babu | పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యా. నేను కలుసుకున్న, మాట్లాడిన అత్యంత వినయపూర్వక స్వభావం కలిగిన వ్యక్తులలో పునీత్ రాజ్‌కుమార్ ఒకరు. ఆయన కుటుంబసభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు మహేశ్ బాబు (Mahesh Babu) ట్వీట్ చేశాడు.
Shocked and deeply saddened by the tragic news of Puneeth Rajkumar's demise. One of the most humble people I've met and interacted with. Heartfelt condolences to his family and loved ones 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) October 29, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్
Puneet Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి