Nithiin | స్టార్ హీరోల సినిమాపై కన్నేసిన నితిన్.. వివరాలివే
కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాను టాలీవుడ్ యువ హీరో నితిన్ (Nithiin) తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది విక్రమ్. కాగా ఇప్పుడు నితిన్ మరో క్రేజీ సినిమాపై కన్నేశాడు.
Nithiin | స్టార్ హీరో కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం విక్రమ్. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ యువ హీరో నితిన్ (Nithiin) హోంబ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది విక్రమ్. కాగా ఇప్పుడు నితిన్ మరో క్రేజీ సినిమాపై కన్నేశాడు.
కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చాసుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కబ్జ (Kabzaa). ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను రుచిర ఎంటర్టైన్మెంట్-ఎన్ సినిమాతో కలిసి నితిన్ సమర్పిస్తుండటం విశేషం. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశాడు నితిన్. తెలుగులో ఉపేంద్ర, సుదీప్ నటించిన కబ్జను మీ ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉంది. సిల్వర్ స్క్రీన్‌పై మార్చి 17న వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాం..అంటూ పోస్టర్‌ను షేర్ చేశాడు నితిన్.
మరి విక్రమ్ లాగే ఈ సినిమా కూడా నితిన్‌కు బాగా కలిసొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్.
కబ్జ చిత్రంలో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, సుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కేజీఎం ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.
నితిన్ ప్రస్తుతం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫేం డైరెక్టర్ వంశీతో సినిమా చేస్తున్నాడు. నితిన్ ఇప్పటికే మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ లొకేషన్లో దిగిన స్టిల్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Happy to bring you all @nimmaupendra Garu & @KicchaSudeep garu’s #Kabzaa in Telugu through our #RuchiraEntertainments & N Cinemas
Gear up for Blazing Entertainment on the big screen,
This March 17th.@shriya1109 @rchandru_movies @RaviBasrur pic.twitter.com/hM74mUi5MU— nithiin (@actor_nithiin) February 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

