టాలీవుడ్ (Tollywood) హీరో నందమూరి బాలకృష్ణ కేర్ ఆస్పత్రి (Care hospital) లో చేరారు. బాలకృష్ణకు కుడి భుజం నొప్పి తీవ్రం కావడంతో సోమవారం కేర్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. డాక్టర్ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో కేర్ ఆస్పత్రి వైద్యుల బృందం బాలకృష్ణకు సుమారు 4 గంటల పాటు సర్జరీ చేసింది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు వెల్లడించారు. త్వరలోనే బాలకృష్ణ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని డాక్టర్లు తెలిపారు. బాలకృష్ణకు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరమని తెలిపారు.
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్లో అఖండ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. మరోవైపు ఆహా ఓటీటీ ప్లాట్ఫాం షో (Unstoppable)తో బిజీగా ఉన్నాడు. నవంబర్ 4న తొలి ఎపిసోడ్ ప్రీమియర్ కానుంది.
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్లో తమన్నా..తాజా అప్డేట్