శుక్రవారం 29 మే 2020
Cinema - Mar 29, 2020 , 21:52:34

టాలీవుడ్‌లో అప్పుడే సందడి మొదలైంది

టాలీవుడ్‌లో అప్పుడే సందడి మొదలైంది

హైదరాబాద్‌:   కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది.   దేశ, రాష్ట్రాల సరిహద్దులు మూసివేయబడ్డాయి. కరోనాని ఎదుర్కొనేందుకు ప్రపంచం మొత్తం ప్రయత్నాలు చేస్తున్నది.    మరి ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌లో సందడి మొదలవ్వడం ఏమిటి? అనే అనుమానం రాకమానదు. అయితే టాలీవుడ్‌లో నిజంగానే సందడి మొదలైంది. ఎలాగంటారా? థియేటర్లలో సినిమా రిలీజ్ అవడం లేదనే గానీ, సోషల్ మీడియాలో మాత్రం టాలీవుడ్ సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ హడావుడి మాములుగా లేదు.

ఒక్క ఆర్ఆర్ఆర్ అనే కాదు..  18 పేజస్, రంగ్‌దే వంటి సినిమాలకు సంబంధించి మోషన్ పోస్టర్స్, ఫస్ట్ లుక్స్ విడుదలవుతుండటం, వాటిపై చర్చ జరుగుతుండటం వంటివి టాలీవుడ్‌లో సందడికి కారణాలు.  అలాగే ఇంటి పట్టునే ఉండి హీరోలు కూడా తమ తదుపరి ప్రాజెక్ట్స్, డైరెక్టర్స్, స్టోరీలు వంటి వాటిపై దృష్టి పెట్టడం, మరోవైపు పూర్తి కావచ్చిన సినిమాలకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతుండటం వంటి విషయాలు టాలీవుడ్‌ని వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి. మొత్తంగా సినిమాలు రిలీజ్ అవ్వడం లేదనేగానీ, టాలీవుడ్‌లో సందడి మాత్రం కరోనా ఉన్నా తగ్గలేదనేది వాస్తవం.


logo