టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ల లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటారు ఎమ్మెస్ రాజు. ఆయన ‘డర్టీ హరి’ సినిమాతో డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఈ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ప్రస్తుతం ‘7 డేస్..6 నైట్స్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. సుమంత్ అశ్విన్, మెహర్ చావల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ..డర్టీ హరి సక్సెస్ తర్వాత ఆడియెన్స్
అదే జోనర్ లో మరో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రం పూర్తిగా కొత్త పంథాలో సాగుతుంది. మా బ్యానర్ టాలెంట్ కలిగిన కొత్త నటీనటులను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తూ బ్రేక్ ఇస్తుంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేశాం. త్వరలోనే నెక్ట్స్ షెడ్యూల్స్ మొదలుపెడతామని చెప్పారు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ తో కలిసి సుమంత్ అశ్విన్, ఎస్ రజినీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Here's the first look of a refreshing tale of love n life #7Days6Nights
— BA Raju's Team (@baraju_SuperHit) July 22, 2021
Stay tuned for an @MSRajuOfficial directorial @SumanthArtPro @MSumanthAshwin @RajnikantSOffl @SamarthGollapu5 @EditorJunaid @WildHoneyPro #WintagePictures @AbgCreations @PulagamOfficial pic.twitter.com/C4Z1RRMbeu
ఇవి కూడా చదవండి..
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?