Fish Venkat : కొంతకాలంగా మూత్రపిండాల (Kidney) సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) కన్నుమూశారు. చందానగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 54 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ యాసలో విలనిజాన్ని, కామెడీని పండించిన వెంకట్ మరణంతో సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది.
ఫిష్ వెంకట్‌గా తెలుగు ప్రేక్షకులను రంజింపజేసిన ఆయన అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్(Mangalampalli Venkatesh). అయితే.. ముషీరాబాద్ చేపల మార్కెట్లో వ్యాపారం చేసిన ఆయన ఫిష్ వెంకట్‌గా గుర్తింపు పొందారు. దర్శకుడు వీవీ వినాయక్ ఆయనను వెండితెరకు పరిచయం చేశారు.
Rest in Peace Comedian #FishVenkat 🙏
A versatile actor who brought both laughter and intensity to Telugu cinema. Your presence will be deeply missed.#RIPFishVenkat #Tollywood #iDreamMedia pic.twitter.com/4NaoZM8e7j
— iDream Media (@iDreamMedia) July 18, 2025
దివంగత రియల్ స్టార్ శ్రీహరి కూడా వెంటక్ సినీ అరంగేట్రానికి సహాయం చేశారు. తనదైన కామెడీతో అనతికాలంలోనే ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు ఫిష్ వెంకట్. వందకు పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశారు. దిల్, ఆది, అత్తారింటికి దారేది బన్నీ, డీజే టిల్లు . వంటి సినిమాలు ఆయనకు విశేష గుర్తింపును తీసుకొచ్చాయి.