చాలా రోజుల నుంచి టాలీవుడ్ (Tollywood) సినీ పెద్దలంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) ని కలవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. రెండు మూడు సార్లు ఆయన అనుమతి కూడా లభించలేదు అనే వార్తలు వచ్చాయి. అయితే ఈ మధ్యే సినీ పెద్దలతో కలిసి మాట్లాడటానికి ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి నుంచి సానుకూల స్పందన వచ్చింది. దాంతో ఆయన దగ్గరికి వెళ్లిన తర్వాత ఏ విషయాల గురించి చర్చించాలి అనే విషయంపై..ఈ మధ్య చిరంజీవి (Chiranjeevi) ఇంట్లో కూర్చుని సినిమా పెద్దలంతా చర్చించారు. అక్కడ ఏయే విషయాలు జగన్ ముందు ఉంచాలి..ఏ సమస్యలను ఆయన ముందు పెట్టాలి..వాటి పరిష్కారం ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాలపై కొన్ని రోజుల కింద చిరంజీవి ఇంట్లో నాగార్జున, ఆర్.నారాయణమూర్తి, అల్లు అరవింద్, సురేష్ బాబు ఏషియన్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్ లాంటి వాళ్లు కలిసి మాట్లాడారు.
ఇందులో కూడా బాలకృష్ణ మిస్ కావడంతో కొందరు విమర్శించారు కూడా. ఈ విషయాన్ని పక్కన పెడితే చాలా రోజులుగా సినీ పెద్దలు వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆగష్టు చివరి వారంలో వైఎస్ జగన్ నుంచి ఇండస్ట్రీ పెద్దలకు అపాయింట్ మెంట్ వచ్చినట్లు తెలుస్తోంది. రండి కలిసి మాట్లాడుకుందామని చిరంజీవితో సహా మరో ఇద్దరు ముగ్గురు సినీ పెద్దలకు వైఎస్.జగన్మోహన్ రెడ్డి నుంచి ఆహ్వానం అందింది. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి..సమస్యల గురించి ఆయన ముందు పెట్టడానికి సినీ పెద్దలు కూడా ఒక పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో ఇప్పటివరకు కేవలం 3 షో లకు మాత్రమే అనుమతి ఉంది. అందులోనూ 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుస్తున్నాయి. వీటితో పాటు టికెట్ల గురించి కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ తో చర్చించడానికి చిరంజీవి టీం సిద్ధమవుతున్నారు. కేవలం ఇది మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి మేలు చేసే మరికొన్ని విషయాలు కూడా అక్కడ చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకేసారి ఎక్కువ మంది రాకుండా అందరి తరఫున కొందరు మాత్రమే ప్రతినిధులుగా రావాలని వైఎస్ జగన్ సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి టాలీవుడ్ పెద్దలు ఏపీ ముఖ్యమంత్రితో ఏం ముచ్చటించనున్నారో..!
ఇవికూడా చదవండి..
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!