ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 07, 2020 , 14:36:38

తాప్సీ ఎక్క‌డికెళ్లిందో తెలుసా..? ఫొటోలు వైర‌ల్

 తాప్సీ ఎక్క‌డికెళ్లిందో తెలుసా..? ఫొటోలు వైర‌ల్

ఝుమ్మంది నాదం సినిమాతో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ భామ తాప్సీ. ఈ బ్యూటీ తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. తాప్సీ న‌టించిన త‌ప్ప‌డ్ చిత్రం ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముగియ‌డంతో తాజాగా త‌న కొత్త చిత్రం షూటింగ్ లో చేరిపోయింది. విజ‌య్ సేతుప‌తితో క‌లిసి న‌టిస్తోన్న  త‌మిళ చిత్రం షూటింగ్ కోసం ఇటీవ‌లే జైపూర్ వెళ్లింది తాప్సీ. అయితే షూట్ షెడ్యూల్ అయిపోయిన వెంట‌నే తాప్సీ మాల్దీవుల‌కు చెక్కేసింది. 

మాల్దీవుల్లో త‌న సోద‌రి శ‌గున్ తో క‌లిసి విలువైన స‌మ‌యాన్ని గ‌డిపింది.  ప్ర‌తీ సారి త‌న సోద‌రితో క‌లిసి టూర్స్ వేసే తాప్సీకి ఈ సారి కరోనా ప్ర‌భావంతో ఆ అవ‌కాశం లేకుండా పోయింది. ప్ర‌స్తుతం లాక్ డౌన్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డంతో మాల్దీవుల‌కు వెళ్లిపోయింది. తాప్సీ త‌న గ్యాంగ్ తో క‌లిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. విజ‌య్ సేతుప‌తి-తాప్సీ చిత్రానికి అన‌బెల్లె సుబ్ర‌హ్మ‌ణ్యం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీప‌క్ సుంద‌ర‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo