Sreeleela | కన్నడ సోయగం శ్రీలీల.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నది. అందం, అభినయంతో.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పటికే.. కుర్ర హీరోల ఫేవరెట్ కో-స్టార్‌గా పేరు తెచ్చుకున్నది. ‘గుంటూరు కారం’లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో.. ఉస్తాద్ భగత్‌సింగ్‌లో పవర్‌స్టార్ పవన్‌తో తెర పంచుకోనున్న ఈ బిజీ భామతో.. మాటాముచ్చట!
పదో తరగతిలో ఉండగానే.. సినిమా ఆఫర్లు తలుపు తట్టాయి. ఇంటర్లో ఉన్నప్పుడే సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టా. కన్నడ చిత్రం ‘కిస్’తో తెరపై కనిపించా! పెళ్లి సంద-డితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చా! ఆ తర్వాతే.. ‘ధమాకా’ మొదలైంది.
ప్రస్తుతం తెలుగు, కన్నడ కలిపి పదికిపైగా సినిమాల్లో చేస్తున్నా! ఇందులో గుంటూరు కారం, ఉస్తాద్ భగత్‌సింగ్ లాంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం నేను బిజీ బటర్ఫ్లైనే! అయితే.. నాకు ఇది ప్రారంభం మాత్రమే! ఎక్కడికో వెళ్లిపోతా!
‘భగవంత్ కేసరి’.. నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా. బాలకృష్ణలాంటి లెజెండ్‌తో నటించాలన్న నా కల.. ఇలా నెరవేరింది. ఇందులో నా పాత్ర కూడా.. నాకు ఎంతో నచ్చింది.
ఇలాంటి పాత్రలే కావాలనే మొండితనం నాకు లేదు. ఎందుకంటే.. సినిమా సినిమాకూ పాత్రలు మారుతుంటాయి. నాకొచ్చే ప్రతి పాత్రలో జీవించడానికి ప్రయత్నిస్తా! అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని.. దర్శకుడు ఆ పాత్రను సృష్టించి ఉంటాడు. దానికి పూర్తిన్యాయం చేసేలా పనిచేస్తాను.
నేను అచ్చమైన పాజిటివ్ థింకర్‌ను! ఎప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటాను. పని చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు. ఫలితాలు మన చేతుల్లో లేవు! వాటి గురించి ఆలోచించకుండా ముందుకు సాగడమే!
అమ్మే.. నా అసలైన హీరో! నా పని సవ్యంగా సాగాలన్నా.. ఒత్తిడి నా నుంచి దూరం కావాలన్నా.. నా పక్కన అమ్మ ఉండాల్సిందే! వ్యక్తిగతంగానే కాదు.. స్క్రిప్ట్ ఎంపిక, కాల్షీట్స్ సర్దుబాట్లు లాంటి వృత్తిగత వ్యవహారాల్లోనూ ఆమె నా వెన్నంటే ఉంటుంది.
అమ్మచేతి వంటే.. నా ఆల్‌టైమ్ ఫేవరేట్! ఎన్ని దేశాలు తిరిగినా.. ఎన్ని స్టార్ హోటళ్లలో తిన్నా.. అమ్మచేతి రుచికి సాటి, పోటీ.. లేనేలేదు. బస్తీ మే సవాల్.
షూటింగ్ లేని రోజుల్లో కంఫర్ట్‌గా ఉండే లూజ్ టీషర్ట్ వేసుకుంటా. జుట్టును ముడేసుకొని కనిపిస్తా! అదే షూటింగ్లో ఉంటే.. పాత్రకు తగ్గట్టుగా ‘ఫ్యాషన్ గేమ్ మోడ్’ ఆన్ చేస్తా!
నాకు కాబోయేవాడికి ముచ్చటగా మూడు మంచి లక్షణాలు ఉండాలి. మొదటిది.. నన్ను ఇష్టంగా భరించాలి. రెండోది.. చక్కని హాస్య చతురత కలిగి ఉండాలి. మూడోది, ముఖ్యమైంది ఫ్యామిలీ మ్యాన్ అయి తీరాలి.
“Sreeleela | ఓర చూపులతో కుర్రకారు మనసు దోచేస్తున్న శ్రీలీల..”