మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 16:38:22

హైద‌రాబాద్ కు ర‌కుల్‌..రిలాక్స్ అయిన క్రిష్ టీం..!

హైద‌రాబాద్ కు ర‌కుల్‌..రిలాక్స్ అయిన క్రిష్ టీం..!

డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌లో భాగంగా టాలీవుడ్ న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ ముంబైలోని ఎస్సీబీ కార్యాల‌యం ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన విష‌యం తెలిసిందే.  ఇప్ప‌టికే ఈ కేసులో ర‌కుల్ ప్రీత్‌సింగ్ తోపాటు శ్ర‌ద్దాక‌పూర్, సారా అలీఖాన్, దీపికా ప‌దుకొనే ను విచారించిన అధికారులు వారి ఫోన్ల‌ను సీజ్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ర‌కుల్ ఈ కేసు విచార‌ణ కోసం టాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిష్ డైరెక్ష‌న్ లో చేస్తున్న సినిమా షూటింగ్ కు బ్రేక్ చెప్పి  ముంబైకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. దీంతో డైరెక్ట‌ర్ క్రిష్ తోపాటు చిత్ర‌యూనిట్ కూడా కొంత అప్ సెట్ అయ్యారు. ఇక‌ విచారణ పేరుతో త‌న టైం వృధా చేసుకోవ‌డం ఇష్టం లేని ర‌కుల్..వెంట‌నే మ‌ళ్లీ తిరిగి హైద‌రాబాద్‌కు వ‌చ్చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. ర‌కుల్ రాక‌తో క్రిష్ అండ్ టీం సినిమాకు సంబంధించిన కీల‌క సన్నివేశాల‌ను పూర్తి చేయాల‌ని ఫిక్స్ అయింద‌ట‌. 

ఎన్సీబీ విచార‌ణ‌కు మ‌ళ్లీ హాజ‌రయే ప‌రిస్థితులు వ‌చ్చే అవ‌‌కాశ‌ముండ‌టంతో ర‌కుల్ వెంట‌నే షూటింగ్ లో జాయిన్ కానున్న‌ట్టు తెలుస్తోంది. 40 రోజుల సింగిల్‌షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేయాల‌నుకున్న క్రిష్..ఒక‌వేళ ర‌కుల్ స‌మ‌యానుగుణంగా షూట్ కు హాజ‌రైతే అనుకున్న టైంకే సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తాడ‌నంలో ఎలాంటి సందేహం లేదు. డైరెక్ట‌ర్ క్రిష్ యువ న‌టుడు వైష్ణ‌వ్ తేజ్ తో క‌లిసి సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. వికారాబాద్ అడ‌వుల్లో షూటింగ్ కొన‌సాగుతోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo