టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) ఇప్పటికే ఫైరింగ్ విజువల్స్‌తో దసరా (Dasara) టీజర్ అప్డేట్ అందించగా.. నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కాగా మేకర్స్ నేడు స్టన్నింగ్ ఊర మాస్ లుక్ ఒకటి విడుదల చేశారు. నాని బల్బు సెట్ చేసి ఉన్న చేతికర్రను చేతిలో పట్టుకుని..బీడీ కాలుస్తూ రాజ్ దూత్ బైక్‌పై కూర్చొన్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.
దసరా ఎలాంటి మాస్ ట్రీట్ ఇవ్వబోతుందో చెప్పడానికి ఈ ఒక్క స్టిల్ చాలంటున్నారు సినీ జనాలు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. దసరా చిత్రంలో నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పక్కా మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. దసరాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నాని మరోవైపు శౌర్యువ్ దర్శకత్వంలో 30వ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
నాని ఊర మాస్ లుక్..
Get ready for the Mass Blast 💥#DasaraTeaser on January 30th 🔥🔥
In Telugu, Tamil, Kannada, Malayalam & Hindi 💥#Dasara in cinemas from March 30th 💥
Natural Star @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @sathyaDP @saregamasouth pic.twitter.com/KrkxuM3GVe
— SLV Cinemas (@SLVCinemasOffl) January 26, 2023