Gun Fire | పరీక్షలు రాస్తుండగా.. బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల మోత, ఇద్దరు మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన (Gun Fire) చోటుచేసుకున్నది. రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీ (Brown University) ఇంజినీరింగ్ బిల్డింగ్‌లో పరీక్ష జరుగుతుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన (Gun Fire) చోటుచేసుకున్నది. రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీ (Brown University) ఇంజినీరింగ్ బిల్డింగ్‌లో పరీక్ష జరుగుతుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. నల్లటి దుస్తులు ధరించిన ఓ దుండగుడు వర్సిటీలో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఏడంతస్తుల బారస్ అండ్ హోలీ భవనంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, ఫిజిక్స్ విభాగం ఉన్నాయి. కాల్పులు జరిగిన సమయంలో ఇంజినీరింగ్ డిజైన్ పరీక్ష జరుగుతున్నదని వెల్లడించారు.
నిందితుడి కోసం వెతుకుతున్నట్లు మేయర్ బ్రెట్ స్మైలీ తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు మరణించారని, గాయపడిన ఎనిమిది మంది పరిస్థితి నిలకగా ఉందన్నారు. క్యాంపస్ సమీపంలో నివసించే ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, బయటకు రాకూడదని కోరారు. ఈ ఘటన విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనను సృష్టించదని చెప్పారు. కాగా, ప్రస్తుతం మనం బాధితుల కోసం ప్రార్థించడం తప్ప మరేమీ చేయలేమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఎఫ్‌బీఐ అధికారులు ఘటనా స్థలంలో ఉన్నారని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో పోస్ట్ చేశారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

