ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 13, 2020 , 18:36:48

చైతూ, అఖిల్ నిర్మాత‌ల‌కు నాగార్జున సూచ‌న‌

చైతూ, అఖిల్ నిర్మాత‌ల‌కు నాగార్జున సూచ‌న‌

అక్కినేని న‌ట‌వార‌సుడిగా మంచి మార్కులు తెచ్చుకున్న‌..కెరీర్ విష‌యంలో చాలా స్టిక్ట్ గా ఉంటాడ‌నే విష‌యం తెలిసిందే. సినిమాలు చేసే విష‌యంలోనూ, నిర్మించే అంశంలోనూ, విడుద‌ల చేసే విష‌యంలోనే చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటాడు. త‌న విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటాడో..కుమారుల విష‌యంలోనూ అంతే కేర్‌ఫుల్ గా ఉంటాడు. థియేట‌ర్లు మూతప‌డ్డ ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో నాగ్‌..చైతూ, అఖిల్ నిర్మాత‌లకు ఓ సూచ‌న చేసిన‌ట్టు ఇపుడు ఫిలింన‌గ‌ర్ లో వార్త‌లు చక్క‌ర్లు కొడుతున్నాయి. నాగచైత‌న్య‌, అఖిల్ సినిమాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుద‌ల చేయొద్ద‌ని, త‌ప్ప‌నిస‌రిగా థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయాల‌ని సూచించాడ‌ట‌.

అఖిల్ తో సినిమా చేస్తున్న అల్లు అర‌వింద్ కు, చైతూతో సినిమా చేస్తోన్న శేఖ‌ర్ క‌మ్ముల ఇదే విష‌యాన్ని ఖరాఖండిగా తేల్చి చెప్పాడ‌ట నాగ్‌. ఇప్ప‌టికే చైతూ సినిమాలు మార్కెట్ లో మంచి ఆద‌రణ ఉంది. అఖిల్ మాత్రం స‌రైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo