Naga Chaitanya | టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య (Naga Chaitanya) ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో సందడి చేశాడు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవడానికి ఆర్టీవో కార్యాలయానికి (Khairatabad RTO office)వచ్చాడు. నాగచైతన్య రెన్యూవల్ కోసం ఆర్టీఏ జాయింట్ కమిషనర్ రమేశ్‌ను కలిశాడు. ఈ మేరకు రవాణా శాఖ అధికారులు నాగచైతన్యను డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు తెలుసుకుని రెన్యూవల్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా చైతూను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆర్టీవో కార్యాలయానికి తరలివచ్చారు. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ (Thandel) సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో NC23 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేసేందుకు రెడీ అవుతున్నారు.
Yuvasamrat @Chay_akkineni visited Khairatabad RTO office to renew his driving license!🤍📸#NagaChaitanya #Thandel #TeluguFilmNagar pic.twitter.com/aiFRY45B9T
— Subhodayam Subbarao (@rajasekharaa) January 21, 2025
Jaat Movie | సన్నీడియోల్-గోపీచంద్ మూవీ కోసం ఏకంగా నలుగురు యాక్షన్ డైరెక్టర్లు.. !
Sankranthiki Vasthunam | ఓవర్సీస్లోనూ తగ్గేదేలే.. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం అరుదైన ఫీట్
Gautham Vasudev Menon | ధృవ నక్షత్రం కథకు సూర్య నో చెప్పడం తట్టుకోలేకపోయా: గౌతమ్ మీనన్