Mahesh Babu | గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) కాంబోలో వస్తోన్న ప్రాజెక్ట్ వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో స్పై జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ గురించి ఆసక్తికర వార్త రౌండప్ చేస్తోంది.
మూవీ లవర్స్, అభిమానులకు థ్రిల్లింగ్ ట్విస్ట్ ఇచ్చేలా టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేశ్ బాబు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నాడన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇందులో మహేశ్ బాబు నటించడం లేదని, వార్ 2 తెలుగు వెర్షన్‌కు వాయిస్ అందించబోతున్నాడని బీటౌన్ సర్కిల్ టాక్.
అంతేకాదు హిందీ వెర్షన్‌కు రణ్‌బీర్ కపూర్ వాయిస్ అందించబోతున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే వార్ 2 జూనియర్ ఎన్టీఆర్-మహేశ్ బాబు కాంబోలో రాబోతున్న రెండో సినిమా కానుంది. మహేశ్ బాబు ఇప్పటికే తారక్ నటించిన బాద్ షా సినిమాకు వాయిస్ ఓవర్ అందించాడని తెలిసిందే.
ఇప్పటికే మేకర్స్ షేర్ చేసిన వార్ 2 గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీని 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. వార్ 2 YRF Spy Universeలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 సినిమాల తర్వాత వస్తున్న ఆరో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Apsara Rani | సినిమాలు వదిలేయాలనుకున్నా.. రాచరికం ఈవెంట్లో అప్సర రాణి