Balakrishna | టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) కాంబోలో వస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్ ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2). టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5నే థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వల్ల వాయిదా పడ్డది. ఊహించని ఈ డెసిషన్‌తో ఇప్పటికే షాక్‌లో ఉన్నారు మూవీ లవర్స్, అభిమానులు.
కాగా ఇప్పుడొక ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు బాలకృష్ణ సినిమాతో పోటీలో ఉండబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి తాజా కథనాలు. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరనే కదా మీ డౌటు. అతడే ఆదిసాయి కుమార్. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న చిత్రం శంబాల (SHAMBHALA). ఏ యాడ్ ఇన్ఫినిటీ ఫేం యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శంబాల మూవీని డిసెంబర్ 25న గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారని తెలిసిందే.
అఖండ 2 వాయిదా నేపథ్యంలో ఈ మూవీని డిసెంబర్ 12న లేదా డిసెంబర్ 25న కానీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వీటిలో డిసెంబర్ 25 ఫిక్సయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆదిసాయికుమార్, బాలకృష్ణ సినిమా మధ్య పోటీ ఉండటం ఖాయమైనట్టే. అఖండ 2 తమ సినిమా డేట్‌న వస్తే ఆది సాయికుమార్ పోటీకి రెడీగా ఉంటాడా..? లేదంటే వేరే తేదీ ఏమైనా చూసుకుంటాడా..? అనేది చూడాల్సి ఉంది.
Shankar | ‘వేల్పారి’తో మరో విజువల్ వండర్ … 1000 కోట్ల ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లో భారీ చర్చ
Bigg Boss 9 Telugu | 13వ వారం టికెట్ టూ ఫినాలే హీట్.. రీతూ, సంజనాల డ్రామాలు చూసి షాక్
Aryan Khan | మరోసారి చిక్కుల్లో ఆర్యన్ ఖాన్.. కేసు నమోదు