Bigg Boss 9 Telugu | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 13వ వారం పూర్తిగా టికెట్ టూ ఫినాలే టాస్క్‌లతో ఉత్కంఠగా సాగింది. మొత్తం ఆరు టాస్క్‌లు నిర్వహించగా, ఒక్కో రౌండ్లో ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ, చివరకు రీతూ, ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్ ముగ్గురు ఫైనల్ రౌండ్‌కు చేరుకున్నారు. శుక్రవారం ప్రసారమైన రింగ్ టాస్క్‌లో రీతూ, కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్, భరణిల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఈ రౌండ్లో భరణి ఎలిమినేట్ కాగా, దీనికి కారణంగా రీతూ తన షర్ట్‌లో రింగ్‌ని దాచుకోవడం హీట్ పుట్టించింది. ఈ విషయం బయట పడటంతో భరణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.
రింగ్ టాస్క్‌లో వివాదం పెరగడంతో రీతూ ఆగ్రహంతో అరుస్తూ, ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోయింది.నా గెలుపు సంతోషం లేకుండా చేస్తున్నారు అని పదేపదే చెప్పడం హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్లకే చికాకు కలిగించింది. ఇదే సమయంలో కళ్యాణ్, భరణి మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. తదుపరి టవర్ టాస్క్‌లో కూడా రీతూ ఏడుస్తూ, అరుస్తూ పెద్ద హంగామా చేసింది. బాల్ తగిలిందంటూ కూడా సెంటిమెంట్ సీన్ క్రియేట్ చేసింది. అయినప్పటికీ కొన్ని టాస్క్‌ల్లో రీతూనే గెలిచింది. చివరగా రీతూ, కళ్యాణ్ మధ్య జరిగిన ఫైనల్ టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో కళ్యాణ్ విజేతగా నిలిచాడు. కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి వచ్చిన కళ్యాణ్ ఈ స్థాయికి రావడం సీజన్ హైలైట్‌గా మారింది.
ఇతర హౌస్మేట్లు ఆనందం వ్యక్తం చేసేప్పటికీ, తనూజ మాత్రం కొంచెం అసహనం, జెలసీ వ్యక్తం చేసినట్టుగానే కనిపించింది. ఇమ్మాన్యుయెల్‌కి ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా పోరాడుతూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన ఒక పాట పాడగా, దాని అర్థం తనకే అన్వయించుకున్న సంజనా ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది.బిగ్ బాస్ కూడా ఇవన్నీ ప్రత్యేకంగా చూపించి హౌస్‌లో జరుగుతున్న డ్రామాను ఫోకస్ చేశాడు.ఇక ఈ వారం ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వారిలో నామినేషన్లో ఉన్న వారు తనూజ, రీతూ, సంజనా, భరణి, సుమన్ శెట్టి, డీమాన్ పవన్. చూస్తే.. ఈ వారం సుమన్ శెట్టి లేదా సంజనాలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఒకే ఎలిమినేషన్నా? లేక డబుల్నా? అనే వివరాలు నేటి ఎపిసోడ్‌తో క్లారిటీ వస్తుంది.