Tiger Nageswara Rao | అదిరిపోయిన స్టూవర్ట్‌పురం.. రంగస్థలం సినిమా రేంజ్లో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ సెట్స్
Tiger Nageswara Rao | టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). 1970లో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా చలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతోంది. వంశీ (Vamsee) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Tiger Nageswara Rao | టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). 1970లో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా చలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతోంది. వంశీ (Vamsee) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తోండగా.. నుపుర్సనన్కు ఇది టాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ కావడం విశేషం. అక్టోబర్ 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్, ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. టైగర్ నాగేశ్వరావు సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని స్టూవర్ట్‌పురం సెట్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక రంగస్థలం సినిమా రేంజ్లో ఉన్న ఈ సెట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
A glimpse into the world of Stuartpuram & its HERO in 6 days 🔥
GET READY FOR THE BLAST ❤🔥#TigerNageswaraRao 🥷 TRAILER OUT ON OCTOBER 3rd 💥
Grand release worldwide on October 20th ❤️🔥@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @AAArtsOfficial @NupurSanon… pic.twitter.com/kfZimCBLVz
— Vamsi Kaka (@vamsikaka) September 27, 2023
ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనుపమ్ ఖేర్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా, మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

