Tiger Nageswara Rao | ‘టైగర్ నాగేశ్వర రావు’ నుంచి సైన్ లాంగ్వేజ్ ట్రైలర్.. చరిత్రలో తొలిసారి.!
Tiger Nageswara Rao | టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). 1970లో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా చలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.
Tiger Nageswara Rao | టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). 1970లో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా చలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, టీజర్, నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుండగా.. రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది.
ఈ చిత్రం తెలుగులో ఏ సినిమా నమోదు చేయని అరుదైన రికార్డు అందుకుంది. ఈ మూవీ నుంచి బధిరుల కోసం సైన్ లాంగ్వేజ్ (సంకేత భాషలో) టైగర్ నాగేశ్వర రావు స్పెషల్ ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. ఇలాంటి ఫీట్ చేసిన తొలి తెలుగు సినిమాగా అత్యంత అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇక టైగర్ నాగేశ్వర రావు ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో కూడా అక్టోబర్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
Great step by @AbhishekOfficl and team to release #TigerNageswaraRao trailer in Indian Sign Language ❤️
Such a nice gesture for the differently abled.#TNRTrailer
– https://t.co/olVBaexOzZThe movie will also release in the Sign Language on October 20th.@RaviTeja_offl… pic.twitter.com/Ry73wGo3LB
— Ramesh Bala (@rameshlaus) October 6, 2023
ఈ సినిమాలో కృతి సనన్ చెల్లి నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తోండగా.. నుపుర్సనన్కు ఇది టాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ కావడం విశేషం. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా.. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇక అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో టైగర్ నాగేశ్వర రావు విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

