Sandhya theatre stampede | పుష్ప 2 (Pushpa 2 The Rule) బెనిఫిట్ షోకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు ఈ నెల 4న రాత్రి అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) గాయాలపాలయ్యాడని తెలిసిందే. శ్రీతేజ్ నిమ్స్హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు .
తాజాగా ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సెక్యూరిటీగార్డ్ సహా థియేటర్ యజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను చిక్కడపల్లి ఏసీపీ వెల్లడించనున్నారు.
అల్లు అర్జున్ రూ.25 లక్షలు సాయం..
ప్రేక్షకులకు వినోదాన్నిచ్చే సినిమా థియేటర్ వద్ద అలా జరగడం బాధగా ఉందని ఇప్పటికే అల్లు అర్జున్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. రేవతి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. ఎంత చేసినా ఆమె లేని లోటు తీర్చలేనిది. నా తరపున రూ.25 లక్షలు సాయం చేయాలని నిర్ణయించుకున్నానని.. ఆమెకు కుటుంబానికి అండగా నిలుస్తానని పేర్కొన్నాడు. సంధ్య థియేటర్ మూసివేతకు సిఫార్సు చేసినట్టు ఇప్పటికే ఓ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.
Daaku Maharaaj | ఆ వార్తలే నిజమయ్యాయి.. అక్కడే బాలకృష్ణ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్