Tollywood | శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి కనిపిస్తుంది. పైగా ఈ మధ్య వైరస్ కూడా బాగా తగ్గిపోవడంతో సినిమాల విడుదల సంఖ్య వారం వారం పెరుగుతుంది. ఈ క్రమంలోనే నవంబర్ 12న శుక్రవారం కూడా దాదాపు అరడజను సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో కొన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ వేదికగా విడుదలవుతున్నాయి. మిగిలిన సినిమాలు థియేటర్లలో వస్తున్నాయి. ఈ వారం వస్తున్న సినిమాల్లో అందరిచూపు ఒకే దానిపై ఎక్కువగా కనిపిస్తుంది. అదే కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క. కొత్త దర్శకుడు శ్రీ సిరిపల్లి తెరకెక్కించిన ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఎక్కువగా చర్చ జరుగుతుంది.
చిరంజీవి టైటిల్‌తో వస్తుండటం కూడా రాజా విక్రమార్కపై అంచనాలు పెంచేసింది. పైగా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. NIA ఏజెంటుగా కార్తికేయ అదరగొట్టాడని ట్రైలర్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది. ఈవారం వస్తున్న సినిమాల్లో ఎక్కువ బిజినెస్ చేసిన చిత్రం కూడా ఇదే. దీంతో పాటు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన పుష్పక విమానం నవంబర్ 12న విడుదల కానుంది. ఇందులో ఒక గవర్నమెంట్ టీచర్‌గా నటిస్తున్నాడు ఆనంద్. గత ఏడాది మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి విజయం అందుకున్న ఆనంద్ దేవరకొండ.. పుష్పక విమానంతో కూడా అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ప్రమోషన్ చేస్తున్నారు.
ఇక మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కురూప్ సినిమా సైతం ఇదే వారం విడుదల అవుతుంది. అయితే ప్రమోషన్స్ పెద్దగా లేకపోవడంతో ఈ సినిమా వస్తున్నట్లు చాలామందికి తెలియదు. కానీ దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ఓకే బంగారం, మహానటి సినిమాలతో ఈయనకు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇదే కురూప్ సినిమాకు కలిసి వస్తుందని నమ్ముతారు దర్శక నిర్మాతలు. ఈ మూడు సినిమాలతో పాటు కపటనాటక సూత్రధారి అనే మరో చిన్న సినిమా కూడా ఇదే వారం వస్తుంది. మొత్తానికి నవంబర్ 12 చిన్న సినిమాలకు అడ్డాగా మారిపోయింది. మరి వీటిలో ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఏ సినిమాలో ఉందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అన్నయ్య చెప్పింది అదొక్కటే.. విజయ్ దేవరకొండపై ఆనంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇటీవలే నాకు బ్రేకప్ అయ్యింది..పుష్పక విమానం ప్రమోషన్స్‌లో బాంబ్ పేల్చిన విజయ్‌దేవరకొండ..!!
Vijay Deavrakonda: రౌడీ హీరోతో బ్రేకప్ చెప్పిన ఆ అమ్మాయి ఎవరు?
Karthikeya | కార్తికేయకు కాబోయే భార్య ఆర్ఎక్స్100 సినిమా ఎందుకు చూడలేదో తెలుసా?
Karthikeya: కార్తికేయ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?