గురువారం 28 జనవరి 2021
Cinema - Nov 19, 2020 , 18:41:01

సుధా కొంగ‌ర‌ ఆఫ‌ర్ కు నో చెప్పిన స్టార్ హీరో..!

సుధా కొంగ‌ర‌ ఆఫ‌ర్ కు నో చెప్పిన స్టార్ హీరో..!

ఇటీవ‌లే సూర్య‌-సుధా కొంగ‌ర కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఆకాశం నీ హ‌ద్దురా చిత్రంపై టాలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించిన విష‌యం తెలిసిందే. సినిమాకు ఫిదా అయిపోయిన విజ‌య్‌దేవ‌ర‌కొండ డైరెక్ట‌ర్ సుధాకొంగ‌ర త్వ‌ర‌లోనే ఓ సినిమా చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా సుధా ఇచ్చిన ఆఫ‌ర్ కు విజ‌య్ నో చెప్పాడ‌ని ఫిలింన‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. తాను తీస్తున్న‌ నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో కీల‌క పాత్ర కోసం విజ‌య్ ను సంప్ర‌దించ‌గా..సుధాకొంగ‌ర‌కు సున్నితంగా నో చెప్పాడ‌ట‌.

పాత్ర న‌చ్చ‌క‌పోవ‌డంతోనే విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ ప్రాజెక్టు ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించిన‌ట్టు టాక్‌. మ‌రి వీరిద్ద‌రి కాంబినేష‌న్ ఎప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్ పై సంద‌డి చేస్తుందో చూడాలి. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్ ఫైట‌ర్ చిత్రంలో న‌టిస్తున్నాడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌. అనన్య‌పాండే హీరోయిన్ గా న‌టిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo