Rajasekhar | తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ (Rajasekhar). కల్కి తర్వాత మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్ చివరగా నితిన్ నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కీలక పాత్రతో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోయింది. తాజాగా రాజశేఖర్ కొత్త సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
పవన్ సాదినేని (Pavan Sadineni) దర్శకత్వంలో రాజశేఖర్ సీరియస్ యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్ చేస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రానికి మగాడు (Magaadu) టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్. 1990లో రాజశేఖర్ నటించిన చిత్రం మగాడు. లేటెస్ట్గా రాబోతున్న సినిమాకు కూడా ఇదే పేరు పెట్టబోతున్నారని నెట్టింట న్యూస్ హల్ చల్ చేస్తుండగా.. మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మల్కాపురం శివకుమార్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని 2024 చివరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాలీవుడ్ సర్కిల్ సమాచారం.
పవన్ సాదినేని ప్రస్తుతం మాలీవుడ్ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆకాశంలో ఒక తార టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. పవన్ సాదినేని నుంచి త్వరలోనే మరిన్ని వివరాలపై క్లారిటీ కానుందని ఇన్సైడ్ టాక్.
Vettaiyan | వెట్టైయాన్ ఫినిషింగ్ టచ్.. తలైవా టీం కొత్త అప్డేట్ ఇదే..!
Nani | నాని సరిపోదా శనివారం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..!
The Greatest of all time | విజయ్ ది గోట్ రీసెన్సార్.. కొత్తగా ఎన్ని నిమిషాలు యాడ్ చేశారంటే..?
Nani | ఒకే ఫ్రేమ్‌లో నాని, శివరాజ్‌కుమార్.. స్పెషల్ ఏంటో తెలుసా..?