Kamal Haasan | భాష ఏదైనా టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్‌కు మాత్రం సూపర్ క్రేజ్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక తమిళ బిగ్ బాస్ షో (Big Boss Tamil)కు కూడా ఫాలోయింగ్ ఎక్కువేనని తెలిసిందే. ఉలగనాయగన్ హోస్ట్‌గా వ్యవహరించే ఈ షో ఎప్పటికప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తూ వస్తోంది. అయితే ఈ సారి మాత్రం ఆ అవకాశం లేదన్న వార్త ఒకటి అందరినీ నిరాశకు గురి చేస్తుంది.
కమల్ హాసన్ (Kamal Haasan) ఈ సారి బిగ్ బాస్ షోకు దూరంగా ఉండబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అందరితో పంచుకున్నాడు ఉలగనాయగన్. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ఏడు సంవత్సరాల క్రితం మొదలైన మా ప్రయాణం నుంచి చిన్న విరామం తీసుకుంటున్నానని బరువెక్కిన హృదయంతో మీకు చెప్తున్నా. ముందుగా ఉన్న సినిమా కమిట్మెంట్స్ కారణంగా బిగ్ బాస్ తమిళ్ అప్‌కమింగ్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించలేకపోతున్నా. ఇండియాలో టీవీ రియాలీటీ షోల్లో ఉత్తమమైనదిగా నిలిచిన బిగ్ బాస్ తమిళ్ ద్వారా మీ ఇళ్లలోకి రావడం విశేష గౌరవంగా భావిస్తున్నా.
మీరంతా నాపై చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ సుదీర్ఘ సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు కమల్ హాసన్. ఇటీవలే కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కమల్ హాసన్ చేతిలో మణిరత్నం కాంబోలో వస్తున్న థగ్ లైఫ్‌తోపాటు ఇండియన్ 3, కల్కి 2898 ఏడీ సీక్వెల్, విక్రమ్ 2తోపాటు అన్బరివ్ డైరెక్షన్లో రాబోతున్న సినిమాలున్నాయి.
என்றும் உங்கள் நான்.@vijaytelevision pic.twitter.com/q6v0ynDaLr
— Kamal Haasan (@ikamalhaasan) August 6, 2024
Kavya Thapar | ఇస్మార్ట్ శంకర్ ఆడిషన్స్‌కు వెళ్లా కానీ.. కావ్య థాపర్ డబుల్ ఇస్మార్ట్ విశేషాలు
NTR Neel | హమ్మయ్య.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా లాంచ్ డేట్ ఫైనల్..!