Pushparaj Sur Name |’పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాల్లో ‘పుష్ప రాజ్’ తన ఇంటి (Pushparaj Sur Name) పేరు కోసం, తన పేరు ముందు ఇంటి పేరు రావడం కోసం ఎంతగా తాపత్రయ పడతాడో, ఇంటి పేరు లేకపోవడంతో ఎంతటి అవమానాలకు గురవుతాడో, కేవలం ఇంటిపేరు కోసమే జీరో నుంచి హీరోగా అతను ఎదిగిన వైనం, తన పేరునే బ్రాండ్‌గా ఎలా మార్చుకుంటాడో.. ఈ రెండు చిత్రాలు చూసిన వాళ్లకు తెలిసిందే. పుష్ప, పుష్ప-2 (Pushpa 2 the rule) ఈ రెండు చిత్రాలు కథను టూకీగా చెప్పాలంటే ఇంటి పేరు కోసం జరిగిన పోరాటమే అని చెప్పాలి.
అయితే సినిమాలో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆ ఇంటి పేరు ‘మొల్లేటి’ అని అందరికి తెలిసిందే. పుష్ప-2 చిత్రంలో పెళ్లి కార్డుపై ‘మొల్లేటి పుష్పరాజ్’అని చూసుకోని హీరో ఎంతటి భావోద్వేగానికి గురవుతాడో అందరికి తెలిసిందే. అయితే సినిమా చూసిన వాళ్లకు సాధారణంగా ఈ ఇంటి పేరు ఎవరిది? బయట ఎవరికైనా ఈ ఇంటి పేరు ఉందా? అనే ఆసక్తి ఉంటుంది.
కాగా మొల్లేటి అనే ఇంటిపేరు ప్రముఖ నటి రోహిణిది కావడం విశేషమని చెప్పుకోవాలి. డబ్బింగ్ ఆర్టిస్టుగా, ప్రముఖ నటిగా ఆమె అందరికి సుపరిచితురాలే. దివంగత నటుడు రఘువరన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ నటి తన నటనతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనకాపల్లికి చెందిన రోహిణి ఇంటి పేరు మొల్లేటి. వాళ్ల నాన్న పేరు రావు నాయుడు పంచాయితీ అధికారి. సో.. కాకతాళీయంగా నటి రోహిణి ఇంటి పేరు మొల్లేటిని సినిమాలో ప్రధాన కథా వస్తువుగా ఉపయోగించారు దర్శకుడు సుకుమార్.
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ నిర్మించిన ఈ చిత్రం దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 1892 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ లో కూడా అందుబాటులో వచ్చిన ఈ చిత్రం గురించి విదేశాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉన్న పతాక సన్నివేశాల పోరాటాల గురించి హాలీవుడ్ సినిమాలు కూడా పుష్ప-2 ఇండియన్ సినిమా నేర్చుకోవాలని అందరూ తమ సోషల్ మీడియా అకౌంట్స్‌ల్లో పోస్ట్ చేస్తున్నారు.
Read Also :
L2 Empuraan | తొలి సినిమాగా.. రిలీజ్‌కు ముందే మోహన్ లాల్ L2E అరుదైన రికార్డ్
Sairam Shankar | విలన్ ఎవరో చెప్పండి.. రూ.10 వేలు గెలుచుకోండి.. సాయి రామ్ శంకర్ బంపర్ ఆఫర్