Pawan Kalyan | వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి, బాబీ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిందని తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా కూడా రాబోతుండగా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ పూజా కార్యక్రమం త్వరలోనే జరుగనున్నట్టు సమాచారం. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రానికి పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నాడట. డైరెక్టర్ బాబీ రీసెంట్గా పవన్ కల్యాణ్‌ను కలిసిన ఫొటోలను నెట్టింట షేర్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఎందుకు కలిశాడనేది క్లారిటీ లేకపోవడంతో ఈ ఇద్దరూ కలిసి మళ్లీ సినిమా చేయబోతున్నారా..? అందుకోసమేనా ఈ మీటింగ్ అని అంతా చర్చించుకుంటున్నారు. లేటెస్ట్గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం బాబీ పవన్ కల్యాణ్‌ను కలిసింది చిరంజీవితో చేసే సినిమా పూజా కార్యక్రమం కోసమేనని అర్థమవుతోంది. ఈ ఏడాది అనిల్ రావిపూడి డైరెక్షన్లో మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు చిరంజీవి. ఇప్పటికే విశ్వంభర సినిమాతోపాటు దసరా డైరెక్టర్‌తో సినిమాను లైన్లో పెట్టాడు చిరు.
మరోవైపు పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు 2, ఓజీ 2, సురేందర్ రెడ్డి సినిమాలను ఒకే చేయగా.. వీటిలో ఏ మూవీ ముందుగా రిలీజవుతుందనేది తెలియాల్సి ఉంది.
US-Iran ceasefire | ఇరాన్-అమెరికా కాల్పుల విరమణపై స్పందించిన ఇండియా.. ఏం చెప్పిందంటే
ACB Raid | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్
Allu arjun | ఐకాన్ స్టార్‌కు గీతా ఆర్ట్స్ స్పెషల్ గిఫ్ట్.. అదిరిపోయే బర్త్‌డే మ్యాషప్ వీడియో