Nani shyam singha roy movie story | నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. సాయిపల్లవి, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది శ్యామ్ సింగరాయ్. తాజాగా విడుదలైన సినిమా టీజర్ కూడా అంచనాలు పెంచేసింది. గత కొన్నేళ్లుగా సరైన విజయం లేని నాని.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తా నిరూపించుకోవాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే టీజర్ విడుదలైన తర్వాత సినిమా కథపై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే విషయం దర్శక నిర్మాతలు ముందుగానే కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఈ రెండు పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. దీనికి సమాధానం టీజర్లోనే ఉంది.
బెంగాల్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఒకప్పుడు కలకత్తాలో దేవదాసి వ్యవస్థ ఎక్కువగా ఉండేది. దాని చుట్టూ అల్లుకున్న కథ శ్యామ్ సింగరాయ్. ఇందులో సాయిపల్లవి దేవదాసిగా నటిస్తున్నట్లు టీజర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. మరోవైపు పోస్టర్లో, టీజర్లో ఎక్కువగా పెన్, చేతిని హైలైట్ చేశారు. దాన్ని బట్టి ఇందులో నాని జర్నలిస్టుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. కలకత్తాలో జరిగే ఈ దేవదాసి వ్యవస్థ ఆగడాల గురించి ఈయన ప్రజలకు తెలిసేలా రాసే ఒక జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఆ పాత్రతో నేటి నాని పాత్రకు ముడిపెడుతూ కథను రాసుకున్నారు. కేవలం కమర్షియల్ అంశాలు మాత్రమే కాకుండా.. ఇందులో సమాజానికి ఉపయోగపడే విధంగా మహిళా ప్రధాన అంశాలు కూడా ఉంటాయని దర్శక నిర్మాతలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ సినిమా కచ్చితంగా తన కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుందని నమ్మకంగా చెబుతున్నాడు నాని. మరి ఆయన నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో డిసెంబర్ 24 వస్తే అందరికీ తెలుస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నాని కెరీర్ కు చావో రేవో.. డేంజర్ జోన్ లో నాచురల్ స్టార్..
కిస్మస్, సాయిపల్లవి..ఈ కాంబినేషన్ నానికి ఎందుకు సెంటిమెంట్?
Nani Kriti Shetty lip lock | హాట్ టాపిక్‌గా నాని-కృతిశెట్టి లిప్‌లాక్ సీన్
ఇందుక్కాదూ.. అభిమానులంతా నిన్ను జై బాలయ్య అంటూ నెత్తిన పెట్టుకునేది..?
Shyam Singha Roy Story | నాని కంటే ముందు ‘ శ్యామ్ సింగరాయ్’ కథ విన్న హీరో ఎవరు..?
నానితో మూడోసారి జోడీ కడుతున్న సమంత.. అలాంటి పాత్రలో..