Dhruv Vikram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ధ్రువ్ విక్రమ్ (DhruvVikram). ఇప్పటికే సినిమాలు చేసినా.. తాను మళ్లీ మొదటిసినిమాతోనే మీ ముందుకొస్తున్నానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు ధ్రువ్. ఈ స్టార్ కిడ్ కాంపౌండ్ నుంచి వస్తోన్న ప్రాజెక్ట్ బీసన్ (Bison). స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. బీసన్ దీపావళి కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉన్నాడు ధ్రువ్.
ఈవెంట్లో ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ.. నా పేరు ధ్రువ్.. ఇప్పటివరకు నేను రెండు సినిమాలు చేశా. మీరు ఆ రెండు సినిమాలు చూడకున్నా నాకెలాంటి ఇబ్బంది లేదు. కానీ బీసన్ మాత్రం మీరు తప్పకుండా చూడాలి. నిజానికి ఇదే నా మొదటి సినిమా. ఈ సినిమా కోసం వంద శాతం కష్టపడ్డా. మారి సెల్వరాజ్సార్ సంబవం చూస్తారు. మీరు మీ కుటుంబం, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్.. అందరితో కలిసి ఈ సినిమా చూడొచ్చునని చెప్పాడు. ఇప్పుడీ కామెంట్స్ సినిమాపై హైప్ పెంచేస్తున్నాయి.
ఇక ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ధ్రువ్ చాలా కష్టపడ్డాడని డైరెక్టర్ మారి సెల్వరాజ్ అన్నాడు. మనం వేరే కథ చేయవచ్చని నేను ధ్రువ్‌కు చెప్పాను.. దానికి ధ్రువ్ అవును ఇది చాలా కష్టం.. కానీ నువ్వు ఈ మూవీ చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నావు. బీసన్ నీ కలల ప్రాజెక్ట్ లాంటిది.. నేను నిన్ను నా తండ్రిలా భావిస్తా. నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకుంటావని నమ్ముతున్నా అని అన్నాడు. ధ్రువ్ అన్న ఆ మాటలు నన్ను కదిలించాయని చెప్పుకొచ్చాడు మారి సెల్వరాజ్.
మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన టైటిల్ లుక్ బ్యాక్ డ్రాప్లో అడవిదున్న కనిపిస్తుండగా.. దాని ముందు కండలు తిరిగిన దేహంతో రన్నింగ్‌కు రెడీ అన్నట్టుగా ఉన్న ధ్రువ్ విక్రమ్ స్టిల్ నెట్టింట హైప్ క్రియేట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ ఆదిత్య వర్మ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ధ్రువ్. ఆ తర్వాత రెండు సినిమాలు చేసిన ధ్రువ్.. మరి బీసన్తో ఎలా ఇంప్రెస్ చేస్తాడనేది ఆసక్తిగా మారింది.
ఎప్పుడూ తమిళ టైటిల్స్‌తో సినిమాలు తెరకెక్కించే మారి సెల్వరాజ్.. మొదటి సారి ధ్రువ్ సినిమాకు ఇంగ్లీష్ టైటిల్ (బీసన్) పెట్టి క్యూరియాసిటీ పెంచుతున్నాడు.
#DhruvVikram at today’s event:
“My Name is Dhruv, I have done 2 Films so far. I have no problem if you haven’t watched those 2 Films✌️. But #Bison you should watch, this is my Actual 1st film🔥. I’ve given my 100% for this🫡. #MariSelvaraj sir ‘Erangi Sambavam pannirukaru’🥵.… pic.twitter.com/AEEHFVz0KR
— AmuthaBharathi (@CinemaWithAB) October 5, 2025
Kayadu Lohar | ఆ సినిమాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం.. తెలుగు మూవీపై కయాదు లోహర్