Kayadu Lohar | డ్రాగన్ సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది కయాదు లోహర్. ఈ అస్సామీ సుందరి నెట్టింట పోస్ట్ పెట్టిందంటే చాలు కామెంట్స్, లైకుల వర్షం కురుస్తుంది. ఈ బ్యూటీ తాజాగా చెన్నైలో జరిగిన ఓ అవార్డ్స్ ఈవెంట్ సెర్మనీలో పాల్గొంది. ఈ సందర్భంగా తనకు బాగా ఇష్టమైన, స్పూర్తిని కలిగించే సినిమా ఏంటో చెప్పింది కయాదు లోహర్. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా..? బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కల్ట్ క్లాసిక్ ఏ మాయ చేశావే.
తాను ఏ మాయ చేశావే తెలుగు, తమిళ వెర్షన్లకు వీరాభిమానినని.. మనస్సును కదిలించే స్టోరీ టెల్లింగ్ చాలా మందికి ప్రేరణ కలిగించేలా ఈ రొమాంటిక్ డ్రామా సాగుతుందని చెప్పింది కయాదు లోహర్. ఈ చిత్రానికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో త్రిష, శింబు (తమిళ వెర్షన్)లో అద్భుతంగా ఉంటుందని.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఆల్బమ్ ఆల్‌టైమ్ ఫేవరేట్ హిట్ లిస్టులో ఉంటుందని చెప్పుకొచ్చింది.
కయాదు లోహర్ ప్రస్తుతం తమిళంలో మూడు, మలయాళంలో ఒక సినిమా చేస్తుంది.
Kalki 2 | సాయిపల్లవితో నాగ్ అశ్విన్ చర్చలు.. ఇంతకీ ప్రభాస్ కల్కి 2 కోసమేనా..?
Aaryan Movie | నితిన్ చేతికి విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సినిమా రైట్స్
The Raaja Saab | ప్రభాస్ ‘ది రాజాసాబ్’ డబ్బింగ్ షురూ.!