Mass Jathara | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం మాస్ జాతర (Mass Jathara). సామజవరగమన ఫేం రైటర్ భాను బొగవరపు దర్శకత్వం వహిస్తు్న్న ఈ మూవీ రవితేజ 75 (RT75)గా వస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదలవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారని తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
మాస్ జాతర నుంచి Hudiyo Hudiyo సాంగ్ అప్డేట్ అందిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాట ప్రోమోను సోమవారం ఉదయం 11:08 గంటలకు లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. క్లాస్ అండ్ మాస్ లుక్‌లో రవితేజ, లంగావోణిలో శ్రీలీల డ్యాన్సింగ్ మూడ్‌లో ఉండటం చూడొచ్చు. మాస్ జాతర మాస్ బీట్స్.. మెలోడీ ట్రాక్‌ను ఫీలయ్యేందుకు రెడీగా ఉండండి అంటూ మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ పాటపై హైప్ పెంచేస్తుంది.
ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి బలగం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. పేరు లక్ష్మణ భేరి.. ఆదాయం చెప్పను తియ్.. ఖర్చు లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం అన్ లిమిటెడ్.. అవమానం జీరో అంటూ మాస్ జాతరపై అంచనాలు పెంచేస్తున్నాడు రవితేజ. ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ, శ్రీలీల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
You’ve grooved to the mass beats of #MassJathara … now get ready to feel the melody! 🕺💃#HudiyoHudiyo is coming to sweep you off your feet ❤️
Song Promo out tomorrow at 11:08 AM! 💣
A Bheems Ceciroleo Musical 🎹
Sung by @HeshamAWmusic & #BheemsCeciroleo 🤩
✍️ #DevIn… pic.twitter.com/9RATbUinMo
— BA Raju’s Team (@baraju_SuperHit) October 5, 2025
Kalki 2 | సాయిపల్లవితో నాగ్ అశ్విన్ చర్చలు.. ఇంతకీ ప్రభాస్ కల్కి 2 కోసమేనా..?
Aaryan Movie | నితిన్ చేతికి విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సినిమా రైట్స్
The Raaja Saab | ప్రభాస్ ‘ది రాజాసాబ్’ డబ్బింగ్ షురూ.!